Ramoji Foundation: సామాజిక బాధ్యతలో భాగంగా రామోజీ ఫౌండేషన్.. మరో రెండు కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్లో.. దాదాపు రూ.3 కోట్ల 85 లక్షలతో రెవెన్యూ కార్యాలయ భవనాల నిర్మాణానికి చేయూతనందిస్తోంది.
రెండుకోట్ల రూపాయలతో ఇబ్రహీంపట్నంలో ఆర్టీవో కార్యాలయ భవన నిర్మాణం చేపడుతోంది. రూ.కోటి 85 లక్షలతో అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తోంది. ఈ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి భూమి పూజ నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం ఆర్టీవో కార్యాలయ భూమిపూజ కార్యక్రమంలో రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయ భూమి పూజలో యూకేఎంఎల్ డైరెక్టర్ శివరామకృష్ణ, ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: