భాగ్యనగరాన్ని మరోసారి వరణుడు(Rain in Hyderabad) పలకరించాడు. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు.. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం(Rain in Hyderabad) కురిసింది. మహాగణపతి నిమజ్జనానికి వెళ్లిన భక్తులు వానలో తడిసిముద్దయ్యారు.
మొజంజాహి మార్కెట్, కోఠి, సుల్తాన్‌బజార్, హుస్సేన్‌సాగర్, పాతబస్తీ ప్రాంతాలలో మోస్తరు వాన(Rain in Hyderabad) పడింది. పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. వర్షంలో(Rain in Hyderabad)నూ గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. చిరుజల్లుల్లో తడుస్తూ.. భక్తులు గణపతి ముందు స్టెప్పులేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు రంగంలోకి దిగి వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేశారు.
ఆకాశమంత మేఘావృతమై ఉండటం వల్ల భారీ వర్షం కురిసే అవకాశముందని కొందరు భక్తులు గణేశ్ శోభాయాత్ర నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. భారీ వాన పడితే.. వరదలో చిక్కుకుంటామేమోనని భయంతో వెనుదిరుగుతున్నారు. ఇంకొందరు మాత్రం జల్లుల్లో తడుస్తూ.. గణేశుణ్ని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు.
ఇదీ చదవండి: ANIL KUMAR: 'పంచాయతీ ఫలితాలకు మించి పరిషత్ ఎన్నికల ఫలితాలు'