ETV Bharat / city

తెలంగాణలో వర్షం ఎఫెక్ట్​: హైదరాబాద్​లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ బంద్​

author img

By

Published : Oct 14, 2020, 2:12 PM IST

వర్షం కారణంగా తెలంగాణలోని హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్​ను మూసివేశారు. సఫారీ పార్క్​తో సహా మరికొన్ని స్థలాల్లో వాన నీరు నిలవడం వల్ల జూపార్కు ను బంద్​ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

rain effect in hyderabad Nehru Zoological Park closed
తెలంగాణలో వర్షం ఎఫెక్ట్​: హైదరాబాద్​లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ బంద్​

తెలంగాణ రాష్ట్రం భాగ్యనగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్ని నీటితో నిండిపోయాయి. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్​ను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సఫారీ పార్క్​తో సహా మరికొన్ని స్థలాల్లో వాన నీరు నిలిచిపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్​ పార్కు ఈనెల 6 నుంచి తెరుచుకుంది. లాక్​డౌన్ కారణంగా మార్చి 15న మూసివేయబడ్డ జూపార్కు.. కొవిడ్​ నిబంధనలు సడలించిన మేరకు తిరిగి ప్రారంభించారు. కానీ ప్రస్తుతం వర్షం కారణంగా బంద్​ కొనసాగుతోంది.

ఇదీ చూడండి:

వరుణుడి ప్రతాపం.. మంజీరా నదిలో చిక్కుకున్న ఏడుగురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.