సీఎం జగన్కు... ఎంపీ రఘురామకృష్ణరాజు మూడో లేఖ రాశారు. ఈసారి.. వైఎస్ఆర్ పెళ్లికానుక, షాదీ ముబారక్ పథకాలపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే పెళ్లికానుక ఆర్థిక సాయం పెంచుతామన్నారని చెప్పారు.
రూ.లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ హామీకి సైతం ప్రజలనుంచి ఆనాడు మంచి మద్దతు వచ్చిందని రఘురామ.. లేఖలో చెప్పారు. త్వరగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
'7 రోజుల్లో చేస్తానన్నారు.. 765 రోజులైంది.. మాట నిలబెట్టుకోండి'