అమరావతి రైతుల ఉద్యమానికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతు తెలిపారు. రైతుల ఆందోళన 200వ రోజుకు చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి 80 శాతం నిర్మాణాలు జరిగాయని ఎంపీ అన్నారు. అమరావతికి ప్రకృతి సానుకూలతలు ఎన్నో ఉన్నాయన్న ఆయన... ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అమరావతి ఉండటమే సమంజసమన్నారు.
రాజధాని విషయంలో ప్రజాభిప్రాయం తీసుకోవాలి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ప్రపంచంలోని తెలుగు వారంతా కోరుకుంటారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ----రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ
అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడమనేది పార్టీ నిర్ణయం కాదు.. ప్రభుత్వ నిర్ణయమని ఎంపీ అభిప్రాయపడ్డారు. గతంలో జగన్ కూడా అసెంబ్లీలో అమరావతికి మద్దతు తెలిపారన్నారు. అన్ని మౌలిక సదుపాయాలు ఉన్న అమరావతిలోనే కార్యనిర్వాహక రాజధాని కొనసాగించాలని ఎంపీ ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి : కొల్లు రవీంద్రను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు