ETV Bharat / city

జగన్ కేసు తేల్చే బాధ్యత నా మీద వేసుకున్నా: రఘురామకృష్ణరాజు

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్​పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ కేసు తేల్చే బాధ్యత తన మీద వేసుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకుడు రాముడో, రావణుడో తేలే వరకు ఆంధ్రప్రదేశ్​లో అడుగుపెట్టబోనని శపథం చేశారు.

రఘురామకృష్ణరాజు
రఘురామకృష్ణరాజు
author img

By

Published : Apr 7, 2021, 2:08 PM IST

Updated : Apr 7, 2021, 3:48 PM IST

రఘురామకృష్ణరాజు

సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ పరిషత్ ఎన్నికలకు సిద్ధమయ్యారని.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. హడావుడిగా ఎన్నికల తేదీ నోటిఫికేషన్‌ను ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోందని రఘురామకృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టారన్న రఘురామ.. ఇప్పుడు విశాఖ, ఇంకా నాలుగు రోజులు పోతే రాష్ట్రాన్ని అమ్మకానికి పెడతారేమోనని వ్యాఖ్యానించారు.

కేసు విచారణ పూర్తి కావాలని సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశా. పాలకుడు రాముడో, రావణుడో తేలే వరకు ఆంధ్రప్రదేశ్​లో అడుగుపెట్టను. జగన్ కేసు తేల్చే బాధ్యత నా మీద వేసుకున్నా. అప్పటివరకు ఆంధ్రప్రదేశ్​లో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేస్తున్నా. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వేశాక బెదిరింపు కాల్స్ వచ్చాయి. సీఎం జగన్ నన్ను అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెల్సింది. పిచ్చిపిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని సీఎంకు సూచిస్తున్నా. నన్ను తప్పించేందుకు కడప నుంచి మనుషులను దింపుతున్నారని సమాచారం ఉంది. దీనిపై ప్రధాని, హోంమంత్రికి ఫిర్యాదు చేయబోతున్నాను. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాని కలిసి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశా. నా మీద ఈగ వాలినా సీఎం జగన్​దే బాధ్యత. వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐకి లేఖ రాశా. గుండెపోటుతో చనిపోయాడంటూ విజయసాయిరెడ్డి ప్రకటించిన వీడియో జత చేసి ఇచ్చా. రమణ దీక్షితులు సీఎం జగన్ విష్ణుమూర్తి అంటూ పోల్చడం దురదృష్టకరం.- రఘురామకృష్ణరాజు, నర్సాపురం ఎంపీ

ఇదీ చదవండీ... సీఎం జగన్ బెయిల్ రద్దు చేయండి.. సీబీఐ కోర్టులో వైకాపా ఎంపీ పిటిషన్

Last Updated : Apr 7, 2021, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.