ETV Bharat / city

స్నేహం ముసుగులో యువతి నుంచి రూ. 3.10 లక్షలు స్వాహా - amaravathi news

ఓ యువతితో స్నేహంగా ఉంటూ ఆమె వద్ద నుంచి రూ.3.10 లక్షలను కాజేసిన ఇద్దరిని తెలంగాణ రాచకొండ సైబర్​ క్రైం పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం రిమాండ్​కు తరలించారు. అపరిచితులను నమ్మొద్దని... ఏటీఎం కార్డు పోగొట్టుకుంటే సంబంధిత బ్యాంకులో వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

cheating women
స్నేహం పేరుతో విలాసాలకు.. మహిళ నుంచి రూ. 3.10 లక్షలు స్వాహా
author img

By

Published : Apr 5, 2021, 6:47 AM IST

స్నేహితురాలి వద్ద రూ. 3.10 లక్షలు కాజేసిన ఇద్దరు నిందితులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రానికి చెందిన పూలకుంట శ్రీనివాసులు, ఉదయ్ మనీశ్​​లు ఉద్యోగం కోసం హైదరాబాద్​కి వచ్చారు. అమీర్​పేట్​లోని ఓ వసతి గృహంలో ఉంటుండగా వీరికి గణేష్ అనే విద్యార్థి పరిచయమయ్యాడు. గణేష్ స్నేహితురాలైన ఓ యువతికి శ్రీనివాసులు, మనీశ్​ దగ్గరయ్యారు. అనంతరం స్నేహంగా మెలిగారు. తరచూ ఆమె ఇంటికి వెళ్తుండేవారు.

నమ్మి ఐడీ నెంబర్​ ఇస్తే..

ఓరోజు ఊరికి వెళ్తూ.. తన ఇంట్లో ఉన్న కుక్కపిల్లను తీసుకెళ్లాలని సదరు యువతి వారిని కోరింది. ఆటో ఛార్జీలకు ఐదు వందలు ఇవ్వాలని శ్రీనివాసులు, గణేష్​ ఆమెను అడిగారు. అందుకు ఆమె తన వద్ద నగదు లేదని.. ఫోన్​ ఇచ్చి నగదు బదిలీ చేసుకోవాలంటూ యూపీఐ ఐడీ చెప్పింది.

గోవాలో విలాసం..

అప్పుడే రూ.5 వేలను తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకున్నారు. ఆమె వద్దనున్న ఏటీఎం కార్డునూ దొంగలించారు. అనంతరం అక్కడ నుంచి గోవాకు వెళ్లిపోయారు. విలాసవంతంగా గడిపి రూ.3.10 లక్షలను ఖర్చు చేశారు. ఓ రెండు ఫోన్లు కొనుగోలు చేశారు.

నిందితులు అరెస్ట్..

విషయాన్ని గ్రహించిన యువతి వెంటనే సైబర్​ క్రైం విభాగంలో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్​ చేసి.. రిమాండ్​కు తరలించారు. ఏటీఎం కార్డు పోగొట్టుకొంటే సంబంధిత బ్యాంకులకు ఫిర్యాదు చేసి అకౌంట్ బ్లాక్​ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

ఇవీచూడండి:

నాపై చేసినవన్నీ నిరాధార ఆరోపణలే.. అవే వివరించా: ఏబీ వెంకటేశ్వరరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.