ETV Bharat / city

TDP PROTEST: ఉపాధి హామీ బిల్లుల కోసం తెదేపా నిరసనలు

ఉపాధి హామీ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నిరసనలు చేపట్టింది. తెలుగుదేశం పార్టీపై కక్షతో గుత్తేదారులకు బిల్లులు ఆపేశారని.. ఉపాధి హామీ బిల్లులు సైతం ఇవ్వటం లేదని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాష్ట్రానికి వచ్చినా మెటీరియల్ కాంపొనెంట్ కింద బిల్లులు చెల్లించకుడా సీఎం కక్షసాధింపు ధోరణిలో ఉన్నారని ఆరోపించారు.

ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నిరసన

author img

By

Published : Jul 13, 2021, 7:42 PM IST

ప్రకాశం జిల్లాలో..

పెండింగ్​లో ఉన్న ఉపాధిహామీ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అవుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని చెల్లించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు.

గుంటూరు జిల్లాలో...

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధిచి పెండింగ్​లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, కొమ్మారెడ్డి చలమారెడ్డి, చిట్టిబాబు..జిల్లా అధికారులను కలిసి వినతి పత్రం అందచేశారు.

తెదేపా హయాంలో ఉపాధి హామీ పథకంలో దేశంలో నెంబర్ వన్​గా నిలిచామని.. అనేక అవార్డులు, రివార్డులు వచ్చాయని గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షడు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామీ అన్ని బిల్లులు ఆగిపోయాయన్నారు. దీనిపై పంచాయతీ అధికారాలు, సిబ్బంది హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు.

కర్నూలు జిల్లాలో...

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని కర్నూలులో తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ నాయకులు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులును
కలిసి వినతిపత్రం అందించారు. తెలుగుదేశం పార్టీపై కక్షతో గుత్తేదారులకు బిల్లులు ఆపేశారని ఉపాధి హామీ బిల్లులు సైతం ఇవ్వటం లేదని ఆ పార్టీ నాయకులు ఆందోళన
వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లాలో...

ఉపాధి హామీ పనుల బకాయిలు వెంటనే చెల్లించాలని అనంతపురం జిల్లా తెదేపా నేతలు డిమాండ్ చేశారు. తెదేపా నాయకులు పల్లె రఘునాథరెడ్డి, పార్థసారథి, తిప్పేస్వామి, పరిటాల శ్రీరామ్, ఉమామహేశ్వర నాయుడులు కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి ఉపాధి హామీ బకాయిలు విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాష్ట్రానికి వచ్చినా మెటీరియల్ కాంపొనెంట్ కింద బిల్లులు చెల్లించకుడా సీఎం కక్షసాధింపు ధోరణిలో ఉన్నారని ఆరోపించారు.

విజయవాడలో..

ప్రభుత్వం మెడలు వంచి ఉపాధిహామీ బిల్లులు కట్టిస్తామని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు. ఉపాధిహామీ పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద తెదేపా నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కలెక్టర్ కు వినతిపత్రాన్ని ఇచ్చారు. రెండేళ్లుగా 8లక్షల కుటుంబాలను ప్రభుత్వం ఉపాధిహామీ బిల్లులు చెల్లించకుండా వేధిస్తోందని నేతలు మండిపడ్డారు. రాజ్యాంగం పట్ల లెక్కలేని తనంతో చట్ట ఉల్లంఘనలకు వైకాపా ప్రభుత్వం పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.1800కోట్లు కేంద్రం విడుదల చేస్తే.. రాష్ట్ర వాటా రూ.600కోట్లు చెల్లించకుండా విచారణల పేరుతో వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.

నెల్లూరు జిల్లాలో...

ఉపాధి హామీ బిల్లులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని నెల్లూరులో తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఉపాధి పనులు చేసినవారు రెండేళ్లుగా బిల్లులు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెదేపా నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో డి.ఆర్.ఓ. చిన్నఓబులేసుకు తెదేపా నేతలు వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి:

CHANDRABABU: 'వైకాపా నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు చాలవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.