ETV Bharat / city

రాజధానిలో లీజుకు గ్రూప్-డి ఉద్యోగుల భవనాలు.. సీఎం ఆమోదం - amaravathi news

CRDA
CRDA
author img

By

Published : Jun 26, 2022, 4:10 PM IST

Updated : Jun 26, 2022, 4:40 PM IST

16:02 June 26

సీఆర్‌డీఏ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం

Group-D Buildings Lease: అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్యోగుల కోసం నిర్మించిన గ్రూప్ డి భవనాలను లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్‌డీఏ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. విట్ యునివర్సిటీకి ఒక భవనాన్ని లీజుకు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఏడాదికి 8నుంచి 10కోట్ల రూపాయల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోంది. ముందుగా ఒక యూనిట్ భవనాన్ని లీజు ప్రాతిపదికన విట్ యూనివర్సిటీకి ఇవ్వాలని ఆలోచన చేస్తున్న ప్రభుత్వం..ఈ మేరకు సంస్థతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఒక టవర్‌ లీజుకు ఇవ్వాలని ఆ తదుపరి మిగిలిన 5 టవర్‌లు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఒక టవర్‌లోని 120 ఫ్లాట్‌లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భవనాల లీజుకు ఇచ్చేందుకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. గ్రూప్‌ డి కేటగిరీ కింద ఉద్యోగులకు 6 రెసిడెన్షియల్‌ టవర్‌లు నిర్మించారు. సీఆర్​డీఏ 2019 నాటికే 7.76 ఎకరాల విస్తర్ణంలో 720 ఫ్లాట్‌ల నిర్మాణాన్ని ప్రారంభించగా.. 65 శాతం మేర పనులు పూర్తయ్యాయి. అంతా పూర్తైతే మొత్తం 10 లక్షల 22 వేల 149 చదరపు అడుగుల సూపర్‌ బిల్టప్‌ ఏరియా అందుబాటులోకి రానుంది.

ఇవీ చూడండి:

Last Updated : Jun 26, 2022, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.