ETV Bharat / city

Telugu akademi scam: తెలుగు అకాడమీ కేసులో పురోగతి.. డబ్బు చెల్లించేందుకు బ్యాంకు అంగీకారం

Telugu akademi scam: తెలుగు అకాడమీ కేసులో కెనరా బ్యాంకు బోర్డు తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. సిబ్బంది సహకారంతో నిందితులు కొల్లగొట్టిన రూ. 10 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఈ సొమ్ము సంబంధిత ఖాతాల్లో జమచేయనున్నట్లు వెల్లడించింది.

Telugu akademi scam
Telugu akademi scam
author img

By

Published : Dec 15, 2021, 7:47 PM IST

Telugu akademi scam: తెలుగు అకాడమీ కేసులో ఎట్టకేలకు కొంత పురోగతి కనిపించింది. కెనరా బ్యాంకులో నిందితులు కొల్లగొట్టిన డబ్బును తిరిగి చెల్లించేందుకు బోర్డు అంగీకరించింది. 10 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడానికి కెనరా బ్యాంకు ఉన్నతాధికారులు అంగీకరించారు. రెండు మూడు రోజుల్లోపు 10 కోట్ల రూపాయలను తెలుగు అకాడమీ ఖాతాలో డిపాజిట్ చేసే అవకాశం ఉంది.

జరిగిన సంగతేంటంటే..

Telugu akademi fixed deposits scam: తెలుగు అకాడమీకి సంబంధించిన 10 కోట్ల రూపాయలను తెలంగాణలోని చందానగర్​లోని కెనరా బ్యాంకులో ఏడాది కాల వ్యవధికి డిపాజిట్ చేశారు. బ్యాంక్ మేనేజర్ సాధనతో చేతులు కలిపిన నిందితులు నకిలీ పత్రాలు సమర్పించి బ్యాంకు ఉన్న డిపాజిట్​ను ఇతర బ్యాంకుకు మళ్లించారు. ఆ తర్వాత నగదును విడతల వారీగా విత్​డ్రా చేసుకున్నారు. బ్యాంకు మేనేజర్ హస్తంతో పాటు.. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్​ను ఇతర ఖాతాలోకి మళ్లించిన వైనాన్ని హైదరాబాద్​ సీసీఎస్ పోలీసులు, తెలుగు అకాడమీ అధికారులు కెనరా బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఆ డిపాజిట్ల విషయమేంటి..?

బ్యాంకు ఉన్నతాధికారులు అడిగిన పత్రాలను తెలుగు అకాడమీ అధికారులు సమర్పించారు. యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారులతోనూ తెలుగు అకాడమీ అధికారులు సమావేశమయ్యారు. తెలంగాణలోని కార్వాన్ యూనియన్ బ్యాంకు శాఖలో 40 కోట్లు, సంతోష్ నగర్ శాఖలో 13 కోట్ల రూపాయలను నిందితులు నకిలీ పత్రాలు సమర్పించి చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీ సహకారంతో కొల్లగొట్టారు. ఈ విషయాన్ని తెలుగు అకాడమీ అధికారులు యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించారు. ఈ డిపాజిట్ల విషయంలో యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

సంబంధిత కథనాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.