Bus accident in East Godavari: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల శివారులో జాతీయ రహదారి పై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి. గుంటూరు నుంచి 35 మంది ప్రయాణికులతో విశాఖపట్నానికి వెళ్తున్న బస్సు మంగళవారం అర్ధరాత్రి నల్లజర్ల సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురయ్యింది. ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో అదుపుతప్పి బోల్తాపడింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని ప్రయాణికులను బస్సులోంచి బయటకు తీశారు. గాయపడ్డవారిని నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గతంలోను ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగాయి. జులై నెల 9వ తేదీన టాటా ఎస్ వాహనం ఇదే ప్రదేశంలో ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మరణించగా.. అందులో వెళ్తున్న వారికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో తరచు ప్రమాదాలు జరుగుతున్న ఈ ప్రదేశాన్ని ప్రమాదాలకు కూడలిగా పరిగణిస్తున్నారు. ఇలాంటి ప్రదేశంలో వాహనాల డ్రైవర్ల మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
ఇవీ చదవండి:
Liquor shops రోడ్లపై బార్లు, అక్కడే కొని పక్కనే తాగి
Constable murder case పోలీసును హత్య చేసినా.. పట్టుకోలేరా?
YSRCP affidavit అమ్మఒడి, రైతుభరోసాలను ఉచిత పథకాలనడం అభ్యంతరకరమన్న వైకాపా