ETV Bharat / city

పండగ వేళ ఆకాశాన్నంటుతున్న కనకాంబరాల ధర - ఎక్కువైన కనకాంబరం పూల ధరలు

దీపావళి పండగ వేళ కనకాంబరాల ధర ఆకాశాన్నంటుతోంది. అనంతపురం జిల్లా బత్తలపల్లిలో... కిలో కనకాంబరాల ధర రూ.1450 ధర పలికింది. నగరాలలో కనకాంబరాలకు మంచి గిరాకీ ఉండటంతో వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు.

Price of kanakambaram flowers has increased during diwali festival season
పండగ వేళ ఆకాశాన్నంటుతున్న కనకాంబరాల ధరలు
author img

By

Published : Nov 13, 2020, 10:24 AM IST

దీపావళి పండుగ వేళ కనకాంబరాల ధర మార్కెట్లో చుక్కలనంటుతోంది. అనంతపురం జిల్లా బత్తలపల్లిలో... కిలో కనకాంబరాల ధర రూ.1450 ధర పలికింది. మార్కెటుకు వచ్చిన పూలను గంటల వ్యవధిలోనే వ్యాపారులు కొనుగోలు చేశారు. పండుగకు నగరాలలో కనకాంబరాలకు మంచి గిరాకీ ఉండటంతో వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. పూలకు మంచి ధర పలకడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. బత్తలపల్లి నుంచి బస్సులు, ఇతర వాహనాల ద్వారా హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు పూలను తరలించారు.

ఇదీ చదవండి:

వినియోగదారుల నుంచి ఆమ్యామ్యాలు డిమాండ్‌.. మొదటి స్థానంలో ఏపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.