తెలంగాణలోని కరీంనగర్‌లో కరోనా మరణాలకు ముందస్తుగా పేర్చిన ఈ చితులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రోజుకు పదికి పైగా శవాలను శ్మశానవాటికలకు తరలిస్తుండటంతో దహన సంస్కారాలు నిర్వహించే ప్రైవేటు వ్యక్తులు ముందుగానే చితులు పేర్చి సిద్ధంగా ఉంచుతున్నారు. మానేరు నదీ తీరంలోని శ్మశానవాటికలో ఈ దృశ్యం కనిపించింది.
ఇతర ప్రాంతాలకు చెందిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తే కుటుంబీకులు కరీంనగర్‌లోనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు అయిదు శవాలను తరలించగా, అందులో నాలుగు కరోనా శవాలు ఉన్నాయని, రాత్రివరకు ఇంకొన్ని వచ్చే అవకాశం ఉండటంతో ముందుగానే కర్రలు పేర్చి సిద్ధంగా ఉంచామని నగరపాలక సిబ్బంది తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా రోగులతో నిండిన ఆస్పత్రి పడకలు.. అంబులెన్సులోనే చికిత్స