కృష్ణా జిల్లా నందిగామలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు హాజరయ్యారు. శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీని స్పూర్తిగా తీసుకొని పొట్టి శ్రీరాములు పని చేశారని కొనియాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ఆయన కృషి ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ అవతరించిందన్నారు. స్థానిక వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు, వైకాపా నేతలు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెదేపా ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్ముని బాటలో పయనిస్తూ.. అహింసా మార్గంలో 56 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేశారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కీర్తించారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కోరారే తప్ప.. కులాల కుంపటి రాష్ట్రాన్ని కోరలేదని చెప్పారు. కానీ.. నేటి రాష్ట్ర నాయకులు కులాల కుంపటి రాష్ట్రంగా మార్చేశారని రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పొట్టి శ్రీరాములు 120 వ జయంతి వేడుకగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్థానిక సీఐ దేవా ప్రభాకర్, ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలు నెమరు వేసుకున్నారు.
ఇదీ చదవండి: