ETV Bharat / city

తెలంగాణ: గ్రేటర్​లో 46.55శాతం.. ఓల్డ్ మలక్​పేటలో రేపు రీపోలింగ్ - జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ శాతం

తెలంగాణలోని జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్​ నమోదైనట్టు ఎన్నికల అధికారి తెలిపారు. ఓల్డ్ మలక్​పేట్​ డివిజన్​లో రేపు రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 4న చేపట్టే ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ghmc elections
జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్ శాతం
author img

By

Published : Dec 2, 2020, 8:57 PM IST

తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తుది పోలింగ్ వివరాలను ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. 149 డివిజన్లలో నిర్వహించిన పోలింగ్​లో 46.55 శాతం ఓటింగ్ నమోదైనట్టు వెల్లడించారు. ఆర్​సీ పురంలో అత్యధికంగా 67.71శాతం, అత్యల్పంగా యూసుఫ్​గూడలో 32.99 శాతం పోలింగ్ నమోదైనట్టు వివరించారు. గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2016లో 45.27శాతంగా నమోదైంది.

ఓల్డ్ మలక్​పేట డివిజన్​లో గుర్తు తారుమారైనందున... పోలింగ్​ను గురువారానికి వాయిదా వేశారు. రీపోలింగ్​ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రీపోలింగ్ దృష్ట్యా రేపు ఓల్డ్​ మలక్​పేట పరిధిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు, విద్యా, వ్యాపార సంస్థలకు సెలవు అమలు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 4 చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా... సర్కిళ్ల వారీగా 30 మంది పరిశీలకులను నియమించారు.

ఇదీ చూడండి:

'అమూల్ రాకతో మరో పాల విప్లవం మొదలవుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.