ETV Bharat / city

ఇళ్ల పట్టాల పంపిణీకి రాజకీయాలే కారణం..!

author img

By

Published : Feb 28, 2021, 10:05 AM IST

రాజకీయ కారణాలవల్లే 34,395 మందికి ఇళ్ల పట్టాలు అందలేదని రెవెన్యూశాఖ వెల్లడించింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో పట్టాలు పంపిణీ చేయలేదని తెలిపింది. వీటి పంపిణీని వచ్చే నెల 20లోగా పూర్తి చేయాలని రాష్ట్ర భూ పరిపాలనశాఖ ప్రధాన కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ తాజాగా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.

Political barriers to the distribution of house site documents
ఏపీలో ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ

ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీకి రాజకీయ కారణాలు అడ్డొస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 25 వరకు రాజకీయ కారణాలతో 34,395 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరగలేదని అధికారులు గుర్తించారు. ఇందులో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 14,827 మందికి ఈ కారణాలతోనే పట్టాల పంపిణీ జరగలేదు. తూర్పుగోదావరి జిల్లాలో 9,311, పశ్చిమ గోదావరి జిల్లాలో 6,112, గుంటూరు జిల్లాలో 2,324, కడప జిల్లాలో 1,821 మందికి చొప్పున పట్టాల పంపిణీకి రాజకీయ కారణాలు అడ్డుగా ఉన్నట్లు ఉత్తర్వుల్లో రెవెన్యూ శాఖ పేర్కొంది.

అయితే ప్రజాప్రతినిధులు తామే పట్టాలు పంపిణీ చేస్తామనడంతో ఆయా ప్రాంతాల్లో పట్టాల పంపిణీ జరగలేదు. అనువుకానిచోట్ల పట్టాలు ఇవ్వడంతో 5,115 మంది తిరస్కరించారని తెలిపింది. కాకినాడ గ్రామీణ మండలం నేమాంలో లోతట్టు ప్రాంతంలో స్థలాలిస్తామన్నారని, తుని ప్రజలకు పట్టణానికి ఆరు కి.మీ.దూరంలో స్థలాలిస్తామన్నారని అక్కడివారు పట్టాలు తీసుకోవడానికి విముఖత వ్యక్తం చేశారు.

టిడ్కో ఇళ్ల పంపిణీలో..

టిడ్కో ఇళ్లను 2,62,312 మందికి ఇవ్వాల్సి ఉండగా 2,12,018 మందికి ఇచ్చారు. రాజకీయ కారణాల వల్ల 8,671 మందికి, గ్రామాల నుంచి వెళ్లిపోవడం వల్ల 2,572, ఇష్టం లేకపోవడం వల్ల 11,445, అనర్హులుగా గుర్తించడం వల్ల 1,782 మందికి గృహాల కేటాయింపు జరగలేదు. ఆధార్‌ నంబర్లు అనుసంధానం కాకపోవడం తదితర కారణాలతో ఇంకొందరికి కేటాయింపు పూర్తికాలేదు. వీటి పంపిణీని వచ్చే నెల 20లోగా పూర్తి చేయాలని రాష్ట్ర భూ పరిపాలనశాఖ ప్రధాన కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ తాజాగా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. చనిపోయిన వ్యక్తి కుటుంబంలో అర్హులుంటే 90 రోజుల పథకంలో వారి పేర్లను చేర్చి, పట్టాలివ్వాలన్నారు. తాజా సమాచారం ప్రకారం 90 రోజుల పథకం కింద ఇప్పటి వరకు 3,26,342 దరఖాస్తులు వచ్చాయి. వీటిని కూడా మార్చి 31లోగా పరిశీలించి అర్హులను గుర్తించాలని మరో ఉత్తర్వులో ఆదేశించారు.

ఇదీ చూడండి:

విశాఖ రైల్వే జోన్‌ ప్రకటనకు రెండేళ్లు.. నేటికీ కానరాని పురోగతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.