ETV Bharat / city

High Court: పోలీసు స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు చట్టబద్ధతే లేదు - ఏపీ తాజా వార్తలు

High Court: చట్టబద్ధత లేని ఏపీ పోలీసు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ (పీఎస్‌వో) ఆధారంగా రౌడీషీట్‌ తెరవడం, వాటిని కొనసాగించడాన్ని తప్పుపడుతూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రౌడీషీట్‌ తెరవడం, నిఘా పెట్టడం, ఠాణాల్లో ఫొటోల ప్రదర్శన సరికాదని పేర్కొంది. ఆ చర్యలు గోప్యత హక్కును హరించడమేనని తేల్చిచెప్పింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Jul 17, 2022, 4:21 AM IST

High Court: చట్టబద్ధత లేని ఏపీ పోలీసు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ (పీఎస్‌వో) ఆధారంగా రౌడీషీట్‌ తెరవడం, వాటిని కొనసాగించడాన్ని తప్పుపడుతూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పీఎస్‌వోలు కేవలం పరిపాలనపరమైన మార్గదర్శకాలేనని స్పష్టం చేసింది. రౌడీషీట్‌ నమోదు, వాటిని కొనసాగించడం, ఆ వ్యక్తులపై నిఘా ఉంచడం, తరచూ ఠాణాలకు పిలవడం, వారి ఫొటోలను పోలీసుస్టేషన్లో ప్రదర్శించడం వ్యక్తుల గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది.

కేఎస్‌ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అతిక్రమించడమేనంది. పీఎస్‌వోల ఆధారంగా పోలీసులు ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడటానికి వీల్లేదని పేర్కొంది. ఇప్పటికీ పీఎస్‌వోలను అనుసరిస్తే.. ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులు కాని అధికారులు సైతం కోర్టుధిక్కరణకు పాల్పడిన వారవుతారని హెచ్చరించింది. రౌడీషీటు తెరవడం, దానిని కొనసాగించేందుకు ఉద్దేశించిన పీఎస్‌వోలోని భాగం, వ్యక్తులపై నిఘాకు సంబంధించిన స్టాండింగ్‌ ఆర్డర్స్‌ చెల్లుబాటు కావని ప్రకటించింది.

పిటిషనర్లపై నమోదు చేసిన రౌడీషీట్లను తక్షణం మూసివేయాలని ఆదేశించింది. చట్టం అనుమతి లేకుండా రౌడీషీటు తెరవొద్దని, వాటిని కొనసాగించొద్దని, వ్యక్తుల సమాచారం సేకరించొద్దని పోలీసులకు తేల్చిచెప్పింది. పీఎస్‌వో పేరు చెప్పి అనుమానితులు, నిందితుల ఇళ్లకు రాత్రిళ్లు పోలీసులు వెళ్లడానికి వీల్లేదంది. చట్టనిబంధనల మేరకు తప్ప.. వారి ఫొటోలు, వేలిముద్రలు తీసుకోవడానికి వీల్లేదంది. ఎన్నికలు, పండగలు, వారాంతపు సెలవుల్లో అనుమానితులు/ నిందితులను పోలీసుస్టేషన్‌కు పిలవకూడదంది.

వారిని ఠాణాల్లో వేచి ఉండేలా చేయవద్దని, స్టేషన్‌ పరిధి దాటి వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలనే షరతు పెట్టొద్దని తేల్చిచెప్పింది. రౌడీషీట్ల నమోదు, కొనసాగింపును సవాలు చేస్తూ దాఖలైన 57 వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు శుక్రవారం ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చారు.

సరైన కారణాల్లేకుండా రౌడీలని ముద్ర వేస్తున్నారు: సుప్రీంకోర్టు, హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను విస్మరించి రౌడీషీట్లు తెరుస్తున్నారని న్యాయమూర్తి ఆక్షేపించారు. తగిన కారణాలు, విశ్వసనీయ సమాచారం లేకుండా చాలామందిపై రౌడీలుగా ముద్ర వేస్తున్నారన్నారు. లోక్‌అదాలత్‌ ద్వారా కేసులను రాజీ చేసుకున్నా, ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టేసినా వారిపై రౌడీషీటు కొనసాగిస్తున్నారని తప్పుబట్టారు.

ఏపీ పీఎస్‌వోకు చట్టబద్ధమైన బలం లేదని హైకోర్టు గతంలోనే స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం దాన్నే అనుసరిస్తోందని వ్యాఖ్యానించారు. 1960లో ఏపీలో పీఎస్‌వోను ప్రవేశపెట్టినప్పుడు.. తర్వాత వాటిని సవరించినప్పుడు కూడా అవి మార్గదర్శకాలు మాత్రమేనని ఆ జీవోల్లోనే పేర్కొన్నారన్నారు. కాబట్టి రౌడీషీటు తెరవడానికి పీఎస్‌వోల పేరు చెప్పి రాష్ట్రప్రభుత్వం తన చర్యను సమర్థించుకోవడం కుదరదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించాలి: పీఎస్‌వో పేరుతో చిన్నచిన్న కేసులకే రౌడీషీట్‌ తెరుస్తున్నారని పిటిషనర్ల తరఫున న్యాయవాది కె.రాజారెడ్డి, సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి తదితరులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలందరికీ తెలిసేలా ఫొటోలను ఠాణాల్లో ప్రదర్శిస్తున్నారన్నారు. వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ గోప్యత హక్కును హరిస్తున్నారన్నారు.

ఈ నేపథ్యంలో నిఘా, తదితర వ్యవహారంలో గోప్యత హక్కును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధ నిబంధనలు లేదా చట్టాన్ని రూపొందించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. నేర నిర్మూలనలో భాగంగా పోలీసులు వివిధ చర్యలు తీసుకునేందుకు సీఆర్‌పీసీ, ఆంధ్రప్రదేశ్‌ అలవాటుపడ్డ నేరస్థుల చట్టం-1962లోని వివిధ సెక్షన్లను వినియోగించుకోవచ్చని సూచించారు.

నేర నిర్మూలనకు నిఘా అవసరం: హోంశాఖ జీపీ
హోం శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది జి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. తప్పనిసరి పరిస్థితుల్లోనే రౌడీషీట్‌ తెరుస్తారన్నారు. దాని వెనుక ప్రజాహితం ఉందన్నారు. నేర నిరోధానికి నిఘా అవసరమని ఏపీ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చిందన్నారు. పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకొని పిటిషన్లను అనుమతించవద్దన్నారు. పీఎస్‌వోను సవాలు చేసే అర్హత పిటిషనర్లకు లేదన్నారు.

ఇవీ చదవండి: జూనియర్​ ఎన్టీఆర్​ను చూడాలని.. మంచానికి పరిమితమైన అభిమాని కోరిక!

పొలంలో మలవిసర్జన చేయొద్దన్నందుకు మూక దాడి.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.