ETV Bharat / city

అమరావతిలో భద్రత కట్టుదిట్టం... భారీగా బలగాల మోహరింపు - ministers conference in amaravathi

నేడు మంత్రివర్గ భేటీ జరగనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధానిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున అమరావతిలో భారీగా బలగాలు మోహరించాయి. వేల సంఖ్యలో పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు.

Police force in Amravati for protecting peace in capital city issue will announceing by cm jagan in ministers conference
మండలి భేటీ నేపథ్యంలో భారీగా తరలివచ్చిన భద్రతా బలగాలు
author img

By

Published : Dec 27, 2019, 4:47 AM IST

Updated : Dec 27, 2019, 11:13 AM IST

మూడు రాజధానుల ప్రకటనపై నేడు మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనున్న నేపథ్యంలో పోలీసులు అమరావతి ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మంత్రివర్గ భేటీ అనంతరం రాజధానిపై ఏదైనా స్పష్టమైన ప్రకటన వస్తే తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కొద్ది రోజులుగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రిమండలి సమావేశం కోసం సచివాలయానికి వెళ్లే రహదారులు, పరిసర గ్రామాల్లో గురువారమే భారీగా పోలీసు బలగాలను దించారు. ఆయా గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఇప్పటికే అమరావతిలో 144 సెక్షన్​ అమలులో ఉందని, ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాజధాని గ్రామాల మీదుగా సచివాలయానికి వెళ్లే ముఖ్యమంత్రి, మంత్రులను అడ్డుకోవటం, అపరిచత వ్యక్తులను నివాసాల్లో ఉంచటం వంటివి చేసినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సచివాలయానికి సమీపంలోని వెలగపూడి, మందడం, మల్కాపురం తదితర గ్రామాల్లో రహదారి వెంబడి ఉన్న ఇళ్లకు... అపరిచత వ్యక్తులను ఇళ్లల్లో ఉంచరాదని నోటీసులిచ్చారు. బందోబస్తు నిర్వాహణపై ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి సచివాలయంలోని గరుడ కమ్యూనికేషన్ సెంటర్​ను సిద్ధం చేశారు. ప్రధాన రహదారుల్లో చెక్​పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. సచివాలయ పరిసరాల్లో సభలు, సమావేశాలకు అనుమతులు లేవని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. వేల సంఖ్యలో పోలీసులు వచ్చినట్లు సమాచారం. పర్యవేక్షణకు ఇద్దరు ఐపీఎస్​ అధికారులను ప్రత్యేకంగా రాజధానికి పంపుతున్నారు. ఇప్పటికే గుంటూరు రూరల్, అర్బన్​ ఎస్పీలు రాజధాని ప్రాంతంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:

నేడు మంత్రివర్గ సమావేశం... అసాధారణ భద్రతా ఏర్పాట్లు!

శివ. పాడేరు ఫైల్: Ap_vsp_77_26_suryagrahana_rokali_prayogalu_vo_ap10082.mp4 యాంకర్: పెద్దల మాట చద్ది మూట అన్న ఈ సామెతను గిరిజనులు నమ్ముతారు. పూర్వం రోజుల్లో ఏ విధంగా సూర్యగ్రహణాన్ని పట్టింది ....వదిలేది తెలుసుకునేవారు. ప్రస్తుతం అదేవిధంగా పాత పద్ధతులను వినియోగించుకుని ప్రయోగించారు. విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం సింగరపాడులో మహిళలు ఇత్తడి ప్లేట్ లో పాలు పోసి గ్రహణం పట్టినప్పుడు రోకలి నిలబెట్టారు. రాతి రోలుపై కూడా రోకలి నిలబెట్టారు. దీనిద్వారా సూర్యుడికి భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి పూర్వం తెలుసుకునే వారని గిరిజనుల అభిప్రాయపడుతున్నారు. గ్రహణం విడవగానే రోకలి పడిపోతుంది. సాంకేతికత లేని రోజుల్లో గ్రహణాన్ని ఇలాంటి పద్దతుల ద్వారా తెలుసుకునే వారని గిరిజనులు చెబుతున్నారు. శివ, పాడేరు
Last Updated : Dec 27, 2019, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.