పోలవరం రివర్స్ టెండర్లలో పాత సంస్థలే మళ్లీ పనులు దక్కించుకుంటున్నాయి. 65వ ప్యాకేజీ పనిని 15.6 శాతం తక్కువ ధరకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ చేజిక్కించుకుంది. ఈ ఏడాది మార్చిలో నిర్వహించన టెండర్లలోనూ ఈ సంస్థే ఆ పనిని సొంతం చేసుకుంది. తిరిగి ఇప్పుడే అదే సంస్థ 58.53 కోట్ల తక్కువకే పనులు చేస్తానంటూ రివర్స్ టెండర్లలో ఎల్1 గా అర్హత సాధించింది.
58 కోట్ల 53 లక్షలు ఆదా...
పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రధాన డ్యామ్‌ను ఎడవ కాలువకు అనుసంధానం చేసే 65వ ప్యాకేజీ పనులకు ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్‌ను పాత గుత్తేదారు సంస్థే దక్కించుకుంది. ఈ ఏడాది మార్చిలో 276 కోట్ల 80 లక్షల విలువతో ఈ పనులకు టెండర్లు పిలవగా..మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ 4.77 శాతం అదనానికి టెండర్లు దక్కించుకోగా...ఇప్పుడు అదే సంస్థ 15.6 శాతం తక్కువకు పనులు చేసేందుకు ముందుకు రావడం గమనార్హం. దీంతో ప్రభుత్వానికి 58 కోట్ల 53 లక్షలు ఆదాకానున్నాయి.
రూ.260. 26 కోట్లకే ముందుకు....
2005లో ఎమ్.ఎస్ యూనిటీ ఇన్‌ఫ్రా సంస్థ ఈ పనులు దక్కించుకోగా...2018లో ఆ సంస్థ ఆర్థిక సమస్యల వల్ల టెండర్లు రద్దు చేశారు. 2019లో ఈ పనులకు ఎల్.ఎస్ పద్ధతిలో టెండర్లు పిలిచారు. ఈసీవీ విలువ కన్నా 4.66 శాతం అదనానికి మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ పనులు దక్కించుకుంది. 290 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నా...కేవలం 0.92 శాతం పనులు మాత్రమే చేపట్టింది. 25శాతం కన్నా తక్కువ చేసిన పనులను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా మరోసారి 274.25 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచింది. ఆరు సంస్థలు ఈ టెండరింగ్‌లో పాల్గొనగా....ఎల్1 గా నిలిచిన గుత్తేదారు సంస్థ 260. 26 కోట్లకే పనిచేసేందుకు ముందుకొచ్చింది.
అంతకన్నా తక్కువకు ఎవరైనా పనిచేస్తారా అంటూ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టింది. దీంతో 231.47 కోట్లకే పనిచేస్తామంటూ మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ ముందుకొచ్చింది. ఇది అంచనా విలువ కన్నా 15.66 శాతం తక్కువ. గతంలో 4.77 శాతం అదనానికి టెండర్లు దక్కించుకున్న ఇదే సంస్థ ఇప్పుడు తక్కువ ధరలకే పనిచేసేందుకు ముందుకొచ్చింది.
ఇవీ చూడండి-రాష్ట్రానికి పెట్టుబడులతో రండి...అభివృద్ధికి సహకరించండి