ETV Bharat / city

RAMAPPA TEMPLE: కాకతీయ వారసత్వానికి రామప్ప ఆలయం ప్రతీక - రామప్ప ఆలయం వార్తలు

కాకతీయ వారసత్వానికి రామప్ప ఆలయం ప్రతీక అని ప్రధానమంత్రి మోదీ కొనియాడారు. రామప్పకు యునెస్కో గుర్తింపు పొందడంపై తెలంగాణ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Ramappa Temple
రామప్ప ఆలయం
author img

By

Published : Jul 25, 2021, 9:22 PM IST

రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రామప్ప ఆలయాన్ని సందర్శించాలని సూచించారు. కాకతీయ వారసత్వానికి ప్రతీక రామప్ప ఆలయమని కొనియాడారు.

శిల్పకళాఖండాలకు నిలయమైన రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. వారసత్వ కట్టడాల ప్రత్యేకతలను పరిశీలించేందుకు... చైనా, ప్యారిస్​లు వేదికగా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ప్రతినిధులంతా... రామప్ప ఆలయ విశిష్టతలను చూసి అచ్చెరువొందారు. ప్రపంచ పర్యాటకులు చూడదగ్గ ప్రదేశంగా భావించారు. తమ ఓట్లతో రామప్ప ఖ్యాతిని మరింత పెంచుతూ... ప్రపంచ వారసత్వ గుర్తింపునిచ్చారు.

వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం... ఉద్దేశించిన ప్రపంచ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశం చైనాలోని ఫ్యూజులో ఈ నెల 16న ప్రారంభమైంది. గతేడాది జూన్​లోనే ఈ సమావేశం జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి నామినేట్ అయిన కట్టడాలపై ముందుగా ప్రతినిధులు చర్చించి అనంతరం.. ఓటింగ్ జరుపుతారు. దాదాపు 21 మంది దేశాల ప్రతినిధులు రామప్పకు ఆమోదం తెలుపడంతో... ఆలయానికి వారసత్వ గుర్తింపు లభించింది. 2020, 21 సంవత్సరాలకు గాను.. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు... యూనెస్కో పరిశీలనకు ఎంపికవగా... మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది.

ఇదీచూడండి: RAMAPPA TEMPLE UNESCO: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.