ETV Bharat / city

ఫ్లాస్మాథెరపి ఎలాంటి ప్రభావం చూపలేదు: ఐసిఎంఆర్‌ - Plasma Therapy Latest news

కరోనా తీవ్రత ఎక్కువైన వారికి దాన్ని తగ్గించుకునే విషయంలో కానీ, మరణాలను నియంత్రించడంలో కానీ ఫ్లాస్మాథెరపి ఎలాంటి ప్రభావం చూపలేదని భారత వైద్య పరిశోధన మండలి-ఐసిఎంఆర్‌ స్పష్టం చేసింది. కన్వాలసెంట్‌ ఫ్లాస్మాథెరపి ప్రభావాన్ని పరిశీలించేందుకు ప్రపంచంలో అతిపెద్ద ప్రయోగం చేసినట్లు ఐసిఎంఆర్‌ వెల్లడించింది.

Plasma Therapy Not effected on Corona Control says ICMR
ఫ్లాస్మాథెరపి ఎలాంటి ప్రభావం చూపలేదు: ఐసిఎంఆర్‌
author img

By

Published : Nov 18, 2020, 11:21 PM IST

కరోనా తీవ్రత ప్రాథమిక స్థాయిలో ఉన్న వారికి తొలి మూడు నుంచి ఏడు రోజుల్లోనే యాంటీబాడీలు అధికంగా ఉన్న ప్లాస్మాను ఎక్కించాలని, పది రోజుల తర్వాత ప్లాస్మాథెరపీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉన్నట్లు తమ ప్రయోగంలో గుర్తించలేదని ఐసీఎంఆర్‌ తెలిపింది. కన్వాలసెంట్‌ ప్లాస్మాలో కేంద్రీకృతమైన ప్రత్యేక యాంటీబాడీస్‌ బట్టి.. ఆరోగ్య పరిస్థితుల మెరుగుదల, రోగ తీవ్రత, ఆసుపత్రిలో ఉండాల్సిన రోజుల తగ్గుదల, మరణాలను నియంత్రణ లాంటి ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది.

ప్లాస్మా ప్రయోజనాలు తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 39 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా తీవ్రత ఉన్న రోగులపై మళ్టీ సెంటర్‌ రాండమైజ్డ్‌ కంట్రోల్డ్‌ ట్రయల్‌ నిర్వహించినట్లు పేర్కొంది. రోగ తీవ్రత పెరుగుదలను నియంత్రించడంలో కానీ, మరణాలు తగ్గించడంలో కానీ ప్లాస్మాథెరపి ఏమాత్రం ఉపయోగపడలేదని గుర్తించినట్లు వెల్లడించింది. కొవిడ్‌ తీవ్రత ఓ మోస్తరుగా ఉన్న 464 మంది రోగులపై చేసి ప్రయోగాల్లో ప్లాస్మా వల్ల ఎలాంటి ప్రయోజనాలు కనిపించలేదని తెలిపింది.

చైనా, నెదర్లాండ్స్‌ల్లో నిర్వహించిన ఇదే తరహా... పరిశోధనల్లోనూ కన్వాలసెంట్‌ ప్లాస్మాథెరపి వల్ల ప్రయోజనాలేమి నిరూపితం కాలేదని పేర్కొంది. ఈ అంశాలన్నీ పరిశీలిస్తే.. విచక్షణారహితంగా ప్లాస్మాథెరపి మంచిది కాదని, యాంటీబాడీస్‌ ఎక్కువ ఉన్న ప్లాస్మాతో పోల్చితే.. తక్కువ ఉన్న ప్లాస్మాతో కొవిడ్‌ చికిత్స వల్ల ప్రయోజనాలు ఉంటాయనే భావనకు వచ్చినట్లు ఐసిఎంఆర్‌ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఎక్కువ యాంటీబాడీస్‌ ఉన్న వారి నుంచి ప్లాస్మా సేకరించి కొవిడ్‌ చికిత్స కోసం ఉపయోగించడం మంచిది కాదని కూడా సూచనలు చేసింది. యాంటీబాడీస్‌ ఉన్న వారికి ప్లాస్మా ఎక్కించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కూడా వైద్య పరిశోధన మండలి తెలిపింది. ఇకపై ప్లాస్మా థెరపి చేసే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను ప్రత్యేకంగా పేర్కొన్నది.

18 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు, 50 కేజీలపైన బరువు ఉన్న పురుషులు, గర్భం దాల్చని మహిళల నుంచే ప్లాస్మా తీసుకోవాలి.

ఆర్‌టిపిసిఆర్‌ టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చిన వారు.. కొవిడ్‌ లక్షణాలు కనిపించిన 14 రోజుల తర్వాత ప్లాస్మా దానం చేయవచ్చు. దీనికి నెగెటివ్‌ రిపోర్టు తప్పని సరి కాదు.

ప్లాస్మాలో న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీ టైటర్స్‌ 1:80 ఉండాలి.

హెచ్‌ఐవి, హెచ్‌బివి, హెచ్‌సివి ఉన్న వారు ప్లాస్మా దానం చేయకూడదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.