భవన అనుమతుల విషయంలో తమ సంతకాలు లేకుండా ప్రాసెస్ చేస్తున్నట్లు పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. లైసెన్స్ నెంబర్లు లేకుండా ప్రాసెస్ చేస్తున్నట్లు కోర్టుకు వివరించారు. అనుభవం లేని సెక్రటరీల అనుమతులకు ఎవరు బాధ్యత వహిస్తారన్న పిటిషనర్ న్యాయవాది... భవిష్యత్‌లో ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. జీవో 119 ప్రకారం నడుచుకోవాలని ధర్మాసనం ప్రభుత్వానికి తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్లానింగ్ అనుమతులు నిలిచిపోనున్నాయి. న్యాయవాది తిరుమాని విష్ణుతేజ పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు. ప్రభుత్వం నాలుగు వారాల సమయం కోరింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇదీ చదవండీ... 'ఎస్సీ, ఎస్టీలపై దాడి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం'