ETV Bharat / city

రాజధాని పనులు కొనసాగేలా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం - అమరావతి పనులపై హైకోర్టులో పిల్ వార్తలు

రాజధాని అమరావతిలో ప్రస్తుత ప్రణాళికల ప్రకారం అభివృద్ధి కార్యక్రమాల్ని కొనసాగించేలా రాష్ట్రప్రభుత్వాన్ని , సీఆర్‌డీఏ అధికారుల్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత  వ్యాజ్యం దాఖలైంది .

pil-file-in-ap-high-court-on-capital-city-amaravthi-works

author img

By

Published : Dec 10, 2019, 5:32 AM IST

రాజధాని అమరావతిలో ప్రస్తుత ప్రణాళికల ప్రకారం అభివృద్ధి కార్యక్రమాల్ని కొనసాగించేలా రాష్ట్రప్రభుత్వాన్ని , సీఆర్‌డీఏ అధికారుల్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది . రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి డి . రామారావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాజధాని ప్రణాళికలను పునఃసమీక్షించి సిఫారసులు చేసేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి జి.ఎన్. రావు సారథ్యంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి సంబంధించిన జీవో 585ను రద్దు చేయాలని కోరారు. మాస్టర్ ప్లాన్​కు అనుగుణంగా రాజధాని పనుల్ని కొనసాగించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ ఛైర్మన్, కమిషనర్​ను ఆదేశిస్తూ మద్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా వ్యవహరించకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు.

ఇదీ చదవండి : విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించాలి:సీఎస్

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.