ETV Bharat / city

30 రోజుల్లో రూ.5 పెరిగిన పెట్రోల్ ధర - హైదరాబాద్​లో పెట్రోల్ ధర

పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. మూడ్రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పెట్రోల్ రేట్లు పెరిగాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.79 పైసలకు చేరిగా.. డీజిల్​ రూ.88.86గా ఉంది.

petrol
petrol
author img

By

Published : Feb 27, 2021, 1:19 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఇంధన ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. లీటర్​ పెట్రోల్​పై 25 పైసలు, డీజిల్​పై 17 పైసల పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌లో ఇవాళ లీటరు పెట్రోలు ధర రూ.94.79పైసలు, డీజిల్‌ ధర రూ.88.86పైసలకు చేరింది. గత మూడ్రోజుల్లో ఎలాంటి పెరుగుదల లేకపోగా.. శనివారం ధరలు పెరిగాయి.

ఫిబ్రవరి ఒకటో తేదీ ధరలతో పోలిస్తే.. హైదరాబాద్‌లో పెట్రోల్​పై రూ.5.02పైసలు, డీజిల్‌పై రూ.5.40 పైసల పెరుగుదల కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులను ఆధారంగా.. ప్రస్తుతం రోజువారీగా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తున్నాయి.

ఇవీ చూడండి:

పీఎస్​ఎల్వీ-సీ 51కు కౌంట్​డౌన్ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.