ETV Bharat / city

నేడు ఆళ్లగడ్డలో సీఎం పర్యటన.. "రైతుభరోసా - పీఎం కిసాన్" రెండో విడత నిధుల విడుదల - Allagadda in Nandyal district

CM Jagan Nandyala tour: సీఎం జగన్ పర్యటనతో రోడ్డుకి ఇరువైపులా ఉండేవారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడమే కారణం అవుతోంది. నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల నుంచి ఎవరిని బయటకు రాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా సీఎం నంద్యాల పర్యటన కోసం మూడు రోజుల ముందే, కిలోమీటర్ పరిధిలో బారికేడ్లను ఏర్పాటు చేసి, షాపులను తొలగిస్తుండటంతో.. ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

Jagan visit to Allagadda
సీఎం పర్యటన
author img

By

Published : Oct 16, 2022, 10:48 AM IST

Updated : Oct 17, 2022, 6:58 AM IST

నేడు ఆళ్లగడ్డలో సీఎం జగన్​ పర్యటన

CM Jagan Nandyala programme : రైతుభరోసా రెండో విడత నిధులు నేడు విడుదల కానున్నాయి. ఆళ్లగడ్డలో నిర్వహించే కార్యక్రమంలో.. సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులు ఖాతాల్లో జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా మూడు రోజుల ముందు నుంచే ఆళ్లగడ్డలో బారికేడ్లు ఏర్పాటుచేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యమంత్రి జగన్ నేడు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పర్యటించనున్నారు. ఇక్కడ నిర్వహించే కార్యక్రమంలో "రైతుభరోసా - పీఎం కిసాన్" నిధులను సీఎం విడుదల చేయనున్నారు. పంట కోతకు, రబీ అవసరాల కోసం ఒక్కో లబ్ధిదారుడికి 4వేల రూపాయల చొప్పున సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2 వేల96.04 కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్లు వివరించింది. ఈ కార్యక్రమం కోసం ఉదయం 9 గంటలకు గన్నవరం విమాశ్రయం నుంచి బయలుదేరనున్న సీఎం.. 10 గంటల 15 నిమిషాలకు ఆళ్ళగడ్డ చేరుకుంటారు. 10 గంటల 45 నిమిషాలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం బటన్‌ నొక్కి రైతుభరోసా నిధులు విడుదల చేస్తారు.

భారీగా బారికేడ్లు ఏర్రాటు..
సీఎం రాక సందర్భంగా ఆళ్లగడ్డలో భారీఎత్తున బారికేడ్లు ఏర్పాటుచేశారు. మూడు రోజుల ముందునుంచే రోడ్లపైన, దుకాణాల ముందు బారికేడ్లు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బారికేడ్ల కోసం కొన్ని దుకాణాలను కూడా తొలగించారు. మరికొన్నిచోట్ల దుకాణాలకు అడ్డంగా కంచెలు ఏర్పాటుచేశారు. దీనివల్ల వ్యాపారం సాగడం లేదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన పేరిట ప్రజలకు అసౌకర్యం కలిగేలా బారికేడ్లు పెట్టడం ఏంటని... తెలుగుదేశం నేత భూమా అఖిలప్రియ ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 17, 2022, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.