ETV Bharat / city

'రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి రికార్డు స్థాయి పనిదినాలు పూర్తి' - పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఉపాధి హామీకి సంబంధించి రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి రికార్డు స్థాయి పనిదినాలు పూర్తి చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈ ఏడాదిలో 9,734 కోట్లు వ్యయం చేశామన్నారు.

మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

author img

By

Published : Mar 25, 2021, 7:09 PM IST

గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించి రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయి పనిదినాలు పూర్తి చేశామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం పనుల్లో అత్యధికంగా 25 కోట్ల పనిదినాలు పూర్తి అయ్యాయని ఆయన వెల్లడించారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈ ఏడాదిలో 9,734 కోట్లు వ్యయం చేసినట్టు మంత్రి పేర్కొన్నారు.

తాడేపల్లిలోని పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై సమీక్షించిన మంత్రి .. కూలీలకు వేతనాలుగా 5,724 కోట్లు చెల్లించినట్టు స్పష్టం చేశారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద 3,658 కోట్లు ఖర్చు అయ్యాయని తెలిపారు. పంచాయతీరాజ్‌ కమిషనర్ కార్యాలయంలో ఉపాధి హామీ మండలి సభ్యులు, అంబుడ్స్‌పర్సన్‌లతో మంత్రి ఉపాధీ హామీ పనుల్ని సమీక్షించారు.

ఇదీ చదవండి:

'రాజీనామా లేఖను ఆమోదించండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.