ETV Bharat / city

'అమరావతి ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్తాం' - పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ న్యూస్

అమరావతి ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. పోలవరం, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం వ్యాఖ్యానించారు.

'అమరావతి ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ కృషి'

author img

By

Published : Nov 20, 2020, 3:36 PM IST

అమరావతి ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని పేరుతో ఉద్ధండరాయునిపాలెంలో నిర్వహించిన సదస్సుకి శైలజానాథ్, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి హాజరయ్యారు.

రాష్ట్ర విభజన సమయంలో ఎక్కడ రాజధాని ఉండాలనే అంశాన్ని స్పష్టంగా తాము చెప్పకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విభజించి ఎంత తప్పు చేశామో....రాజధానిని ఎక్కడ నిర్మించాలనే నిర్ణయాన్ని చెప్పకపోవటం అంతే తప్పని అన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యనించారు.

భాజపా చేతిలో వైకాపా ప్రభుత్వం కీలుబొమ్మలా తయారైందని తులసీ రెడ్డి విమర్శించారు. దేశ, రాష్ట్రాల రాజధానులన్ని నదుల ఒడ్డున ఉన్నాయన్నారు. అమరావతి సైతం కృష్ణా నది ఒడ్డున ఉందని గుర్తు చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనేది తమ నినాదమని స్పష్టం చేశారు.

ఇదీచదవండి

ట్రంప్ తరహాలోనే జగన్ వ్యవహారం: యనమల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.