ETV Bharat / city

Pawan on Repeal three capital law: జగన్‌ ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర లేపింది - పవన్ కల్యాణ్ - pawan fires on ycp govt

Pawan Kalyan
on Repeal three capital laws
author img

By

Published : Nov 22, 2021, 8:27 PM IST

Updated : Nov 22, 2021, 9:40 PM IST

20:22 November 22

కొత్త బిల్లు ప్రవేశపెడతామని ప్రజలను గందరగోళంలోకి నెట్టారు: పవన్‌కల్యాణ్‌

మూడు రాజధానుల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు(Pawan reaction on Repeal three capital law). 3 రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్..  మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి రాష్ట్ర ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని విమర్శించారు. రాజధాని అమరావతికి సంబంధించి 54 కేసుల్లో హైకోర్టు(ap high court on amaravati cases)లో విచారణ జరుగుతుందని.. ఓటమి తప్పదని గ్రహించిన ప్రభుత్వం బిల్లుల రద్దుకు ఉపక్రమించిందన్నారు.

కోర్టు తీర్పుతో గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో.. వైపాకా ప్రభుత్వం(pawan fires on ycp govt) కొత్త నాటకానికి తెర లేపిందని పవన్ అన్నారు.  ఉమ్మడి ఏపీ విడిపోయి ఏడున్నర సంవత్సరాలు గడుస్తున్నా రాజధాని ఎక్కడుంటుందో తెలియని స్థితికి ఈ పాలకులు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని వివిధ రాష్ట్రాలను ఉదాహరణగా చూపిస్తున్న పాలకులు.. ఏ రాష్ట్రంలోనూ రెండు, మూడు రాజధానులు లేవనే విషయాన్ని విస్మరించారని జనసేనాని ఆక్షేపించారు. 3 రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి జరుగుతుందన్న భ్రమలోనే  వైకాపా పెద్దలు మునిగి తేలుతున్నారని ఎద్దేవా చేశారు.

'33 వేల ఎకరాలలో రాజధాని నిర్మించాలంటే మౌలిక వసతులకు తక్కువలో తక్కువ రూ.లక్ష కోట్లు అవసరమవుతాయి. అది వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. రాజధాని కోసం రోడ్డెక్కిన రైతులపై పలు చోట్ల లాఠీ ఛార్జీలు చేసి భయోత్పాతానికి గురి చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై 3వేలకు పైగా కేసులు పెట్టారు. మహిళలపైనా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఒకే రాజధాని కావాలని రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ ఒకే మాటపై నిలిస్తే.. ఒక్క వైకాపా మాత్రమే మూడు రాజధానుల పాట పాడింది. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలను ఇచ్చి, త్యాగనిరతిని చాటిన అమరావతి రైతులకు జనసేన బాసటగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు రాష్ట్రమంతటికీ విస్తరించాలని, రాజధాని మాత్రం అమరావతి ఒక్కటే ఉండాలని జనసేన కోరుకుంటోంది. తాత్కాలిక ప్రయోజనంతో కాకుండా దూరదృష్టితో రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న సంపూర్ణ రాజధానికి అనుగుణంగా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి’ - పవన్ కల్యాణ్, జనసేన అధినేత

ఇదీ చదవండి

Repeal three capital laws: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 3 రాజధానుల చట్టం ఉపసంహరణ

Last Updated : Nov 22, 2021, 9:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.