గులాబ్ తుపాను (gulab cycone) సృష్టించిన బీభత్సం, భారీ వర్షాల వల్ల ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకూ అతలాకుతలమైందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి.. వేలాది ఇళ్లల్లోకి నీళ్లు ప్రవేశించి.. జనజీవనం అస్తవ్యస్తం కావడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం దెబ్బతినడంతో ప్రజలు అంధకారంలో ఉన్నారని, వీలైనంత త్వరగా విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను పునరుద్ధరించాలని సంబంధిత శాఖలకు విజ్ఞప్తి చేశారు.
ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలి..
జనసేన నాయకులు, శ్రేణులు తమ పరిధిలో బాధితులకు సహాయపడాలని పవన్ పిలుపునిచ్చారు. గులాబ్ తుపాను (gulab cycone) వల్ల రైతులు తీవ్రంగా దెబ్బ తిన్నారని విచారం వ్యక్తం చేశారు. గులాబ్ తుపాను మూలంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్ట పరిహారం లెక్కించడంలో ప్రభుత్వం అనుసరించే విధానాలు మారితేనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. నామమాత్రపు సాయంతో సరిపెడితే ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. ఎకరానికి రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకూ పరిహారం ఇస్తేనే రైతులు కోలుకోగలరని, ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: