ETV Bharat / city

పవన్​ కల్యాణ్​ పర్యటనలో అపశృతి.. ఇద్దరు అభిమానులకు గాయాలు - Pawan Kalyan fan injured in suryapet

Pawan Kalyan Visit to Nalgonda: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు వచ్చిన అభిమాన నటుడిని చూసేందుకు వెళ్లిన ఇద్దరు యువకులకు ప్రమాదవశాత్తు గాయాలయ్యాయి. హీరోకు షేక్​హ్యాండ్​ ఇస్తుండగా అనుకోకుండా వాళ్లపైకి కారు దూసుకెళ్లింది. దీంతో ఒకరికి తీవ్రగాయాలు కాగా.. మరొకరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

Pawan Kalyan Visit to Nalgonda
పవన్​ కల్యాణ్​ పర్యటనలో అపశృతి
author img

By

Published : May 20, 2022, 8:13 PM IST

Pawan Kalyan Visit to Nalgonda: జనసేన అధినేత పవన్‌ కల్యా ణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడలో పవన్‌ కల్యాణ్​ పర్యటిస్తుండగా.. ఆయన కాన్వాయ్‌ తగిలి ఇద్దరికి గాయాలయ్యాయి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త కడియం శ్రీనివాస్ కుటుంబసభ్యులను పవన్‌ పరామర్శించారు. అక్కడికి భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులను బౌన్సర్లు తోసేశారు. దీంతో కూచిపూడికి చెందిన షేక్ నాయబ్ రసూల్.. నడుము, కాళ్లపై నుంచి కాన్వాయ్‌ వెళ్లింది. తీవ్రగాయాలైన రసూల్‌ను మొదట కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి అరవింద్‌ కాలికి స్వల్ప గాయాలయ్యాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ పర్యటించారు. ఇటీవల మృతిచెందిన జనసేన కార్యకర్తలు సైదులు, శ్రీనివాసరావు కుటుంబాలను పరామర్శించేందుకు... ఆయన నల్గొండ జిల్లాకు వెళ్లారు. ముందుగా చౌటుప్పల్ మండలం లక్కారానికి చెందిన సైదులు కుటుంబాన్ని పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన సేనాని... సైదులు భార్యకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.