ETV Bharat / city

'ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? పోలీసులతో కొట్టిస్తారా?'

నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని.. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ.. జనసేన నాయకులు, కార్యకర్తలు చేస్తున్న పోరాటాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు. పోలీసుల తీరుపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అరెస్టులను అధినేత పవన్ కల్యాణ్, పార్టీ సీనియర్ నేతలు ఖండించారు.

pawan
pawan
author img

By

Published : Jul 20, 2021, 12:40 PM IST

నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని.. కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళనలు చేస్తున్న జనసేన నాయకులను.. పోలీసులు అరెస్ట్ చేయడంపై.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. తమ పార్టీ నేతలను విడుదల చేయాలన్నారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా.. అని ప్రశ్నించారు. మరోవైపు.. విజయవాడ ఉపాధి కార్యాలయానికి వెళ్లిన పార్టీ సీనియర్ నేత పోతిన మహేష్‌.. అధికారులే బయటకు రావడంతో విజ్ఞాపనపత్రాన్ని వారికి అందజేశారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పి.. ఇప్పుడు జాబ్‌ లెస్‌ క్యాలెండర్ ప్రకటించారని ఆగ్రహించారు. జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌పై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ముద్దులు కురిపించి.. ఇవాళ పోలీసులతో కొట్టిస్తారా అని పోతిన మహేశ్​ దుయ్యబట్టారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కల్పనా కార్యాలయాల్లో.. వినతిపత్రం ఇవ్వాలని జనసేన పిలుపునిచ్చింది. దీంతో ఆ పార్టీ నేతల ఇంటి వద్ద పోలీసులు బందోస్తు ఏర్పాటు చేసి.. ముందస్తు గృహనిర్బంధం చేశారు. ఇళ్ల నుంచి బయటకు వస్తే.. వారిపై కేసులు పెడతామంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులను దాటుకుని జనసేన నాయకులు ఉపాధి కల్పనా కార్యాలయాల్లో వినతిపత్రాలు అందిస్తున్నారు.

గుంటూరు, జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ నేతలను.. పోలీసులు ముందస్తు గృహనిర్బంధం చేశారు. గుంటూరు లాడ్జి సెంటర్ సమీపంలోని జనసేన కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోనూ జనసేన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉపాధి కల్పనా కార్యాలయానికి వెళ్తున్న ఆ పార్టీ నాయకులను జనసేన కార్యాలయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చదవండి:

JANASENA: నిరుద్యోగుల సమస్యలపై జనసేన పోరాటం.. నేతల గృహ నిర్భంధం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.