ETV Bharat / city

ఇకపై కాగిత రహిత కార్యాలయాలు

author img

By

Published : Jun 16, 2020, 2:58 PM IST

దేశంలోని ఐదు వందలకు పైగా... కేంద్ర జీఎస్టీ, కస్టమ్స్ కార్యాలయాల్లో కాగితరహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్-19 నివారణతో పాటు పాలనాపరంగా అంతర్గత సామర్థ్యం, పారదర్శకతల పెంపొందించేందుకు 'ఈ- ఆఫీసు' విధానం కీలకపాత్ర పోషించనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన నూతన విధానం వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు వేగవంతమయ్యేందుకు తోడ్పాటు అందించనుంది.

paperless offices due to corona effect
కరోనా కారణంగా కాగిత రహిత కార్యాలయాలు

వ్యాపార, వాణిజ్య సంస్థలతో ఎక్కువగా సంబంధాలు ఉండే.. కేంద్ర జీఎస్టీ, కస్టమ్స్​ కార్యాలయాలన్నింటిలో కాగితరహిత సేవలు నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. దీనితో పాలనాపరమైన కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు - సీబీఐసీ ఆశిస్తోంది.

ఇప్పటి వరకు ప్రతి ఫైలు పైఅధికారి నుంచి కిందకు, తిరిగి కింద నుంచి పైఅధికారికి వెళ్తేకానీ.. ఆ ఫైలు ప్రక్రియ పూర్తి అయ్యేది కాదు. సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తవడానికి వారం నుంచి రెండు వారాలు అంతకు మించి సమయం పట్టేది. ఇదే అదనుగా కొందరు అధికారులు ఆ ఫైలును వేగంగా కదిలించేందుకు, అనుకూలంగా పని చేసి పెట్టేందుకు తగిన విధంగా అక్రమ లబ్ధి పొందేవారు.

  • కరోనాతో భయం

ఇది కాకుండా ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని భయాందోళనకు గురి చేస్తోంది. తాజాగా కేసులు అధికంగా నమోదవుతుండడం వల్ల... దేశ వ్యాప్తంగా అందరిలోనూ భయాందోళనలు చోటు చేసుకున్నాయి. ఒకరికి ఒకరు దగ్గరగా నడవాలన్నా... కూర్చోవాలన్నా.. ఎక్కడైనా ముట్టుకోవాలన్నా... భయం భయంగా బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

  • కాగిత రహిత విధానం

ఈ పరిస్థితుల్లో కాగితపు రహిత విధానం అందుబాటులోకి రావడం విశేషం. సంస్కరణల్లో భాగంగా సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ విధానం పాలనపరంగా ప్రక్షాళన కావడం, పారదర్శకత, జవాబుతనాన్ని పెంచుతుంది. ఫేస్‌లెస్, కాంటాక్ట్‌లెస్, పేపర్‌లెస్ విధానం అందుబాటులోకి రావడం... కరోనా వ్యాప్తిని పూర్తిగా నిలువరించినట్లు అవుతుంది.

ఫైళ్లను నిర్వహించడం, ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవడం లాంటి అంతర్గత ప్రక్రియలను ఆటోమేట్ చేయడం ద్వారా పాలన మరింత మెరుగవుతుంది. ఇకపై వ్యాపార, వాణిజ్య సంస్థలకు ప్రతినిధులు కార్యాలయాల చుట్టూ... అధికారుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా, మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. ఫైళ్లు కొంతకాలానికి నాశనమయ్యే అవకాశం ఉంది. కానీ ఇ-కార్యాలయ నిర్వహణతో రక్షణ కల్పించినట్లయింది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు-సీబీఐసీ ఛైర్మన్ ఎం.అజిత్ కుమార్ నిన్నటి రోజున దేశంలోని 500కి పైగా సీజీఎస్టీ, కస్టమ్స్ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ దరఖాస్తును లాంఛనంగా ప్రారంభించారు. సీబీఐసీకి చెందిన 800 మంది సీనియర్ అధికారుల సమక్షంలో ఇ-కార్యాలయ దరఖాస్తును రిమోట్‌ ద్వారా ప్రారంభించారు. 50వేల మందికిపైగా అధికారులు, సిబ్బంది పని చేసే సీబీఐసీలో ఈ విధానం అందుబాటులోకి రావడం ఆ విభాగం అంతర్గత కార్యాలయ విధానాలను ఆటోమేట్ చేసిన వాటిలో అతిపెద్ద ప్రభుత్వ కార్యాలయాల్లో ఇదొకటని చెప్పొచ్చు.

ఇవీ చూడండి: వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే.. కేసుల పేరుతో వేధింపులు: ప్రత్తిపాటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.