కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ రాష్ట్రంలోని గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం రూ.242 కోట్లతో పశు సంవర్థక ప్రాజెక్టు ప్రారంభించనుంది. పాడి పశువుల పెంపకం, పాలు, పాల ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ఆర్థికాభివృద్ధికి సాయం అందిస్తుంది. స్వయం సహాయక సంఘాల్లోని గిరిజన మహిళల్ని 10 మంది చొప్పున బృందాలుగా ఏర్పాటుచేసి ఆర్థిక సాయం అందిస్తుంది. ఒక్కో మహిళకు రెండు పాడి గేదెల చొప్పున బృందానికి 20 గేదెల కొనుగోలు, షెడ్డు ఏర్పాటు, దాణా కొనుగోలుకు సాయం అందిస్తుంది.
ఒక్కో యూనిట్‌కు (రెండు గేదెలు) రూ.1.30 లక్షల చొప్పున కేటాయిస్తుంది. లబ్ధిదారులు యూనిట్ విలువలో 5% వెచ్చించాలి. లబ్ధిదారుల ఎంపిక, గోకులం ఏర్పాటు, సాయం పంపిణీని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ పర్యవేక్షిస్తుంది. యూనిట్ల కొనుగోలు, వాటి పోషణ తదితర ప్రక్రియకు పశు సంవర్థకశాఖ సహకారం అందిస్తుంది. రూ.28.34 కోట్లతో పెరటికోళ్ల పెంపకానికి కేంద్రం సాయం అందించనుందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
CM Jagan: 'సెప్టెంబరు 22న కోర్టుకు రండి' : ఈడీ కేసుల్లో జగన్‌కు సీబీఐ కోర్టు సమన్లు