ETV Bharat / city

లోక్‌ అదాలత్‌లో ఒక్కరోజే 15607 పైగా కేసులు పరిష్కారం

author img

By

Published : Jul 11, 2021, 10:39 AM IST

లోక్‌ అదాలత్‌లలో ఒక్కరోజే 15 వేల 607కు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. 25.50 కోట్ల పరిహారం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 313 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు.

lok adalat
లోక్‌ అదాలత్‌

రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు మంచి స్పందన వచ్చింది. ఒక్కరోజే 15 వేల 607కు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. 25.50 కోట్ల పరిహారం అందజేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 313 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు. రాజీకి అవకాశం ఉన్న పలు కేసుల్ని సామరస్యంగా పరిష్కరించారు. హైకోర్టు ప్రాంగణంలో ఏపీ హైకోర్టు న్యాయ సేవాధికార సంఘం ఆధ్వర్యంలో 5 ఈ-లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొని 561 కేసులను పరిష్కరించారు. 7.04 కోట్లు పరిహారం చెల్లించారు. జస్టిస్ A.V.శేషసాయి, జస్టిన్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ ఎం.గంగారావు, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు, జస్టిస్ బట్టు దేవానంద్... హైకోర్టులో నిర్వహించిన అదాలత్‌లలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Papikondalu: పునఃప్రారంభమైన పాపికొండలు విహారయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.