పెట్రోలు, హైస్పీడ్ డీజీల్ పై వసూలు చేస్తున్న రహదారి అభివృద్ధి సెస్సును 100 శాతం మేర ఆంధ్రప్రదేశ్ రహదారి అభివృద్ధి కార్పొరేషన్ ( ఏపీఆర్డీసీ)కు బదలాయించాలని ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేక పీడీ ఖాతాను ఏర్పాటు చేస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక నుంచి ప్రత్యేక సెస్సు విధింపు ద్వారా వసూలైన రెవెన్యూను ఏపీఆర్డీసీ ప్రత్యేక పీడీ ఖాతాలో జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రతీ లీటరు పెట్రోలు, హైస్పీడ్ డీజీల్ పై రూపాయి చొప్పున సెస్సును ప్రభుత్వం వసూలు చేస్తోంది. దాదాపు 600 కోట్ల రూపాయల మేర సెస్సు ద్వారా వసూలు అవుతుందని అంచనా.
ఇదీ చదవండి
పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే... మీ యుద్ధంలో మేం భాగస్వామ్యం కాబోము: సుప్రీంకోర్టు