గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను రాజకీయ పక్షాల నేతలు కలిశారు. స్థానిక ఎన్నికలు మళ్లీ మొదటినుంచి నిర్వహించాలని 10 పేజీల వినతిపత్రం అందజేశారు. ఏకగ్రీవాలు సహా అన్నింటిని రద్దు చేసి రీనోటిఫై చేయాలని కోరారు. ఎస్‌ఈసీ పేరిట వచ్చిన లేఖను ఈసీ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషనర్ భద్రత విషయం కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు విపక్ష నాయకులు తెలిపారు. రాష్ట్రంలో పరిణామాలన్నీ ఆయనకు వివరించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: