ETV Bharat / city

ban on crackers: ఆ రాష్ట్రంలో బాణసంచా కాల్చడంపై నిషేధం! - పశ్చిమ్​ బంగా

దీపావళి అంటే అందరికీ గుర్తు వచ్చేది బాణసంచా కాల్చుతూ ఎంజాయ్​ చేయడం. కానీ ఈసారి ఆ అవకాశం లేదండోయ్​. ఒకవేళ కాల్చాలి అనుకుంటే పర్యావరణానికి హాని కలిగించని బాణాసంచాకు మాత్రమే అనుమతినిచ్చింది కాలుష్య నియంత్రణ మండలి. అది కూడా రెండు గంటలు మాత్రమేనండోయ్​. ఇంతకీ అది ఏ రాష్ట్రంలో తెలుసా..!

crackers
crackers
author img

By

Published : Oct 27, 2021, 8:55 PM IST

పశ్చిమ​ బంగాల్​లో దీపావళి వేడుకలకు కేవలం గ్రీన్ క్రాకర్స్​కు మాత్రమే అనుమతినిస్తూ పశ్చిమ బంగా కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా 2 గంటల పాటు మాత్రమేనని స్పష్టం చేసింది. దీపావళి రోజున సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు రెండు గంటల పాటు గ్రీన్ క్రాకర్లను అనుమతించనున్నట్లు తెలిపింది. 'ఛఠ్ పూజ' వేడుకల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో 35 నిమిషాల పాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు అనుమతిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

"మా ఆదేశాలను తప్పక అమలు చేయాలి. ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాం. పోలీసుల సహకారంతో ఎప్పటికప్పుడు మా బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తాయి" అని పశ్చిమ​ బంగా కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కల్యాణ్ రుద్ర తెలిపారు.

బాణసంచా కాల్చడం వల్ల కాలుష్య స్థాయి పెరుగుతుంది. కరోనా పరిస్థితుల్లో కాలుష్య స్థాయిలు పెరగడం వల్ల కొవిడ్​ రోగుల్లో శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మరింత కఠిన చర్యలు తీసుకుంది.

ఇదీ చూడండి:

అయ్యో తల్లీ.. వైద్యమందే దారిలేక బాలింత మృతి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.