ETV Bharat / city

తెలంగాణ: ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు - engineering students

ఇంజినీరింగ్‌, బీఫార్మసీ, ఇతర కోర్సుల పాత విద్యార్థులకు ఈనెల 24 నుంచి ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు జేఎన్‌టీయూహెచ్‌ నిర్ణయించింది. 2020-21లో తొలిసారి చేరే విద్యార్థులకు తప్ప మిగిలిన వారికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఈనెల 17 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించుకునేందుకు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది.

online-lessons-for-engineering-students-from-the-24th-of-this-month
ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు
author img

By

Published : Aug 13, 2020, 11:18 AM IST

2020-21లో తొలిసారి చేరే విద్యార్థులకు తప్ప మిగిలిన వారికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఈనెల 17 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించుకునేందుకు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో జేఎన్‌టీయూహెచ్‌ ఇంజినీరింగ్‌, బీఫార్మసీ, ఇతర కోర్సుల పాత విద్యార్థులకు ఈనెల 24 నుంచి ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు నిర్ణయించింది. వర్సిటీ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ.. తరగతి గది బోధన మొదలవ్వాలంటే హాస్టళ్లను తెరవాల్సి ఉంటుందన్నారు. దానిపై ఉన్నత విద్యామండలి నుంచి ఆదేశాలు రాలేదని చెప్పారు.

  • రోజుకు గరిష్ఠంగా 4 పిరియడ్లు

రోజూ గరిష్ఠంగా 4 పిరియడ్లు బోధించేందుకు అనుమతి ఇస్తారు. మూడా, నాలుగా అన్నది కళాశాలల ప్రిన్సిపాళ్లు నిర్ణయించుకుంటారు. మధ్యాహ్న భోజనానికి ముందు మూడు, తర్వాత ఒక పిరియడ్‌ జరుపుకోవచ్చు. ఒక్కో పిరియడ్‌ గంట వరకు ఉంటుంది. నెల తర్వాత సమీక్షించి మార్పులు చేస్తారు. స్వయంప్రతిపత్తి కళాశాలల్లో నెల రోజులుగా నిత్యం నాలుగేసి తరగతులు జరుగుతున్నాయి.

  • సెప్టెంబరు 16 నుంచి చివరి సెమిస్టర్‌ పరీక్షలు!

జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని బీటెక్‌, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలు సెప్టెంబరు 16 నుంచి మొదలుపెట్టేందుకు అధికారులు కాలపట్టిక సిద్ధం చేశారు. వారం రోజుల్లో పూర్తికానున్నాయి. విద్యార్థులు ఇప్పుడున్న ఊళ్లకు దగ్గరలోని కళాశాలల్లో పరీక్షలు రాసుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు. వర్సిటీ పరిధిలో 30 స్వయంప్రతిపత్తి కళాశాలలు ఉండగా సాధారణంగా అవే ప్రశ్నపత్రాలను తయారుచేసుకుంటాయి. ఈసారి మాత్రం ఆ పత్రాలను వర్సిటీకి పంపించాల్సి ఉంటుంది. ఒక కళాశాల విద్యార్థులు వేర్వేరు చోట్ల పరీక్షలు రాయనున్నందున ఏ కాలేజీలో ఎందరు హాజరవుతారో వివరాలు తెప్పించుకొని ఆ మేరకు వాటికి ప్రశ్నపత్రాలను సరఫరా చేయనున్నారు.

ఇదీ పరిస్థితి..

  • ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు: బీటెక్‌- లక్ష మంది, ఇతర కోర్సులు దాదాపు 35వేలు
  • పరీక్షలు రాసే బీటెక్‌ చివరి సెమిస్టర్‌ విద్యార్థులు: సుమారు 60వేలు (అటానమస్‌లో 25వేలు కలుపుకొని)

ఇవీ చదవండి..

కొవిడ్ సమాచారానికి హెల్ప్​లైన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.