ETV Bharat / city

విజయసాయిరెడ్డిపై పోస్టు ఫార్వర్డ్..వృద్ధుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు - east godavari news

సామాజిక మాధ్యమాల్లో వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు.. ఓ వృద్ధుడిని పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జరిగింది.

ijayasai Reddy on social media
వట్టికూటి నరసింహారావు
author img

By

Published : Jun 27, 2020, 7:34 AM IST

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో నివాసముంటున్న వట్టికూటి నరసింహారావు(66) సామాజిక మాధ్యమాల్లో వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై వచ్చిన పోస్టును ఫార్వర్డ్‌ చేసినందుకు సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ తగాదాలతో నరసింహారావు 8నెలలుగా రామచంద్రపురం రత్నంపేటలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్య, కుమారుడు నెలపర్తిపాడులో నివాసముంటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతం నుంచి విజయసాయిరెడ్డిపై ఫేస్‌బుక్‌లో వచ్చిన పోస్టును ఆయన సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్‌ చేశారు. దీనిపై మంగళగిరికి చెందిన బొట్టు రవి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు మంగళగిరి అర్బన్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. గురువారం రామచంద్రాపురం వచ్చిన పోలీసులు నరసింహారావును మంగళగిరి తీసుకెళ్లారు. తాను సొంతంగా పోస్టు పెట్టలేదని, ఫార్వర్డ్‌ మాత్రమే చేశానని చెప్పినా వినలేదని చుట్టుపక్కలవాళ్లు చెబుతున్నారు.

ఇవీ చదవండి: ధర్మాన కృష్ణదాస్​కు డిప్యూటీ సీఎం..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.