Officials ignore the growing caesarean: రాష్ట్రంలో సిజేరియన్లు ఎక్కువవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య రాష్ట్రవ్యాప్తంగా 2,32,436 ప్రసవాలు జరిగితే అందులో 45% సిజేరియన్లు కావడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. ఇందులో 36% ప్రభుత్వాసుపత్రుల్లో, మిగిలిన 54% ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. పట్టణ/ నగర/ గ్రామీణ మహిళలు నొప్పులు భరించేందుకు వెనుకంజ వేస్తుంటే.. కొండాకోనల్లో నివసించే గిరిజన మహిళలు మాత్రం ఎంత నొప్పి అయినా సరే సహజ ప్రసవాలకే సిద్ధమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భం దాల్చినప్పటి నుంచి ఆశా, ఏఎన్‌ఎంల ద్వారా సేవలు పొందిన గర్భిణుల్లో ఎక్కువ మందికి సిజేరియన్లు తప్పడం లేదు. సకాలంలో ప్రసవాలు జరగనందున కొన్నిచోట్ల తల్లీబిడ్డలకు ప్రమాదకర పరిస్థితులు తలెత్తి సిజేరియన్లు తప్పనిసరవుతున్నాయి.
గర్భిణులు నొప్పులు భరించలేమని చెబుతుండటం, కుటుంబసభ్యుల ఒత్తిడి వల్ల వైద్యులు కూడా వేచి చూడకుండా సిజేరియన్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో సహజ కాన్పులు పెంచేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రయత్నిస్తున్నా.. అక్కడ తగిన వసతులు లేకపోవడం, వైద్య సిబ్బంది ‘రిస్క్’ తీసుకునేందుకు సిద్ధంగా లేనందున సిజేరియన్లు పెరుగుతున్నాయని సీనియర్ అధికారి ఒకరు విశ్లేషించారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేవలం డబ్బు కోసమే కాన్పుకోతలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
గిరిజనులు నొప్పులు భరిస్తారు
గిరిజనులు ఎక్కువగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 6,197 ప్రసవాలు జరిగితే కేవలం 180 మాత్రమే సిజేరియన్లు (3%) నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో 4,381కు 26% సిజేరియన్లు నమోదయ్యాయి. కొండాకోనల్లో జీవించే గిరిజన మహిళలు ప్రసవ తేదీకి కొద్ది రోజుల ముందు వరకు పనులు చేసుకుంటూనే ఉంటున్నారు. దీంతో వీరికి సహజ ప్రసవానికే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
‘గిరిజనులు దూరప్రాంతాల్లోని ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రయత్నించరు. సిజేరియన్ అయితే మళ్లీ అదే జరుగుతుందని భయపడతారు. నొప్పులు భరిస్తాం.. సహజ ప్రసవం మాత్రమే చేయాలని వారే అడుగుతున్నందున వైద్యులు కూడా సాధారణ ప్రసవానికి ప్రయత్నిస్తున్నారు’ అని అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అదనపు అధికారి లీలాప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కొతలు పెరిగుతున్నప్పటికి ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడంతో సర్వత్రా విమర్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు చెపట్టాలని ప్రజలు కొరుకుంటున్నారు.
ఇవీ చదవండి: