సుప్రీంకోర్టులో ఒడిశా ప్రభుత్వం కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. తమ భూభాగంలోని 3 పంచాయతీల పేర్లు మార్చి ఎన్నికలు నిర్వహిస్తున్నారని పిటిషన్లో పేర్కొంది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని ఆరోపించింది. సీఎస్, ఎస్‌ఈసీ నుంచి సంజాయిషీ కోరి కారకులపై చర్యలు తీసుకోవాలని వ్యాజ్యంలో పేర్కొంది. గంజాయ్‌పదర్ పేరును గంజాయ్‌భద్రగా , ఫట్టు సెనరీ పేరును పట్టుచెన్నూరుగా, ఫగు సెనరీ పేరు పగులుచెన్నూరుగా మార్చారని పిటిషన్ లో తెలిపింది. 3 పంచాయతీల్లో గతంలో తాము ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్న ఒడిశా.. అందుకు సాక్ష్యాలు ఉన్నాయని వివరించింది. 3 పంచాయతీల్లో ఏకగ్రీవం చేసినట్లు.. పగులూరు చెరువుగా పిలిచే ఫగుసెనరీలో మాత్రం ఎన్నికల నిర్వహించినట్లు వ్యాజ్యంలో పేర్కొంది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని.. ఉన్నతాధికారుల నుంచి సంజాయిషీ కోరాలని ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి: పల్లెపోరు: తొలివిడతలో కొన్ని చోట్ల ఆలస్యంగా ఫలితాలు