ETV Bharat / city

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు.. మరిన్ని కేసులు పెరిగే ప్రమాదం!

మొన్న శ్రీకాకుళం.. నిన్న కర్నూలు.. తాజాగా కృష్ణా... ఇలా రాష్ట్రంలో క్రమంగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు మరణించగా అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లాల్లో వైద్యులకు సూచనలివవ్వడం సహా.. తగిన ఔషధాలను సిద్ధం చేయడంపై దృష్టి పెట్టారు.

black fungus cases in ap
black fungus cases is increasing in AP
author img

By

Published : May 17, 2021, 4:18 AM IST

కరోనాతో పోరాడి గెలిచినా కొందరిని బ్లాక్ ఫంగస్ రూపంలో మరో మహమ్మారి కలవరపెడుతోంది. గుజరాత్, మహారాష్ట్రలో ఇటీవల కలకలం రేపిన బ్లాక్ ఫంగస్ కేసుల ఆనవాళ్లు.. రాష్ట్రంలోనూ వెలుగు చూస్తున్నాయి. శ్రీకాకుళం, కర్నూలు, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో పలువురు ఈ ఫంగస్ బారిన పడ్డారు. కర్నూలు ఆస్పత్రిలో ముగ్గురు వ్యక్తులు కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో వారిలో ఇద్దరు తిరిగి సర్వజనాసుపత్రికి వచ్చి అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. మరో యువకుడు హైదరాబాద్‌లో ప్రాణం కోల్పోయాడు. కృష్ణా జిల్లాలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందిన వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకింది. సంబంధిత ఔషధాలను అతి కష్టం మీద సమకూర్చిన అధికారులు తగిన చికిత్స అందించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన మందుల కొనుగోలుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

సాధారణ రోజుల్లో అరుదుగా కనిపించే బ్లాక్‌ ఫంగస్‌ ఇప్పుడు కరోనా బాధితుల పాలిట శాపంగా మారుతోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ అధికంగా వినియోగించిన సందర్భాల్లో ఈ ఫంగస్‌ ముప్పు ఏర్పడుతోందని వైద్యులు విశ్లేషించారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రమాదం నివారించొచ్చని చెబుతున్నారు. రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు మరిన్ని పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు . అందుకు తగినట్లుగా ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరముందని సూచిస్తున్నారు .

ఇదీ చదవండి

శైలజా టీచర్​ జీవిత ప్రస్థానం... సినిమాను తలదన్నే ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.