NTR Trust: కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 8వేల కుటుంబాలకు నిత్యావసరాలు, మందులు, పిల్లలకు పాలను ఇప్పటికే అందించామని, అదే స్ఫూర్తితో మిగిలిన వారికీ ఇస్తామని వెల్లడించారు. సహాయ కార్యక్రమాల అమలుపై సీఈవో రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి ఆమె బుధవారం సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, మందులు, ఇతర వస్తువుల్ని అందిస్తున్నామని, ఇందుకు అవసరమైన సరకుల్ని ఇప్పటికే ఆయా ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ సహకారాన్ని అందించడమే తమ ధ్యేయమని, ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్నదే తమ సిద్ధాంతమని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఎన్టీఆర్ ట్రస్టు ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి: