అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమానికి ప్రవాసాంధ్రులు మద్దతు ప్రకటించారు. ఎన్ఆర్ఐ అనిల్.. తన మిత్రులతో కలిసి రాజధాని గ్రామాల్లో ఈరోజు పర్యటించారు. అక్కడి రైతులతో మాట్లాడి.. వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. తన వంతుగా ఉద్యమానికి రూ.4.20 లక్షలు విరాళం అందజేశారు. దేశానికి అన్నం పెట్టే రైతు.. రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిరావడం బాధాకరమన్నారు. ఈ పోరాటానికి తనతో పాటు విదేశాల్లోని తెలుగు వారందరూ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు.
రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో.. వేలాది మంది రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి అన్నారు. రాజధాని నిర్మాణం ఆపివేయడంతో రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయేతర ఐకాస నేత మల్లికార్జున రావు, దళిత ఐకాస నేత గడ్డం మార్టిన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: