ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్వ దేశం మనది. పంచాయతీ సర్పంచి నుంచి ప్రధానమంత్రి వరకు ఎవరు గెలవాలన్నా పౌరుల ఓటుతోనే. అందుకే ఓటుకు అంత విలువ. అయితే చాలామంది ఓటు వేయడానికి బద్ధకిస్తుంటారు. దీనివల్ల అవినీతిపరులు రాజ్యమేలే పరిస్థితి ఎదురవ్వొచ్చు. అయితే ప్రపంచంలోని చాలా దేశాలు ప్రత్యేక చట్టాలు, శిక్షలతో పాటు జరిమానాలు విధిస్తూ ఓటు వినియోగంపై చర్యలు తీసుకుంటున్నాయి.
- ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్, గ్రీస్, అర్జెంటీనా, బెల్జియం, పెరూ దేశాల్లో ఓటు వేయకపోతే జరిమానాలు విధిస్తారు.
- బెల్జియంలో పలుమార్లు ఓటు వినియోగించుకోకుంటే రద్దవుతుంది.
- ఆస్ట్రేలియాలో ఓటు వేయకపోతే 20 నుంచి 50 డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. అది చెల్లించకుంటే జైలుకు పంపుతారు.
- సింగపూర్‌లో ఓటేయని పౌరులను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. మళ్లీ జాబితాలో పేరు చేర్చాలంటే కఠిన నియమాలు పాటించాల్సి వస్తుంది.
- బొలీవియా దేశంలో ఓటు వేయకుంటే వేతనంలో కొద్ది మొత్తంలో నగదు కోత విధిస్తారు. గ్రీస్‌లో ఓటు వేయకుంటే డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు తదితరాలు పొందడానికి ఇబ్బందిగా మారుతుంది.
ప్రజలు విధిగా ఓటేసి పాలకులను ఎన్నుకోవాలని ప్రపంచంలో సుమారు 30కి పైగా దేశాలు ఇలాంటి చట్టాలు చేశాయి.