ఏపీ శాసన మండలికి నలుగురు కొత్త సభ్యులను నామినేట్ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తోట త్రిమూర్తులు, లేళ్ళ అప్పిరెడ్డి, మోసేన్ రాజు, రమేష్ యాదవ్ లను గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ నామినేట్ చేసినట్టు సాధారణ పరిపాలన శాఖ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈనేల 11వ తేదీతో కౌన్సిల్ నుంచి టి.డి.జనార్ధన్, బీద రవిచంద్ర యాదవ్, శమంతకమణి, గౌరివాని శ్రీనివాసుల పదవీ కాలం పూర్తి అయినట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఖాళీ అయిన స్థానాల్లో కొత్త వారిని గవర్నర్ నామినేట్ చేసినట్టు సాధారణ పరిపాలన శాఖ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: RaghuRama letter to Jagan: సీఎంకు ఏడో లేఖ రాసిన ఎంపీ రఘురామ!