ETV Bharat / city

వర్సిటీల్లో ఆచార్యులేరీ? 60 శాతానికి పైగా పోస్టుల ఖాళీ - Andhrapradesh universities Faculty issue

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 60 శాతానికి పైగా పోస్టుల ఖాళీగా ఉన్నాయి. ఒప్పంద, అతిథి అధ్యాపకులే దిక్కుయ్యారు. విశ్వవిద్యాలయాల్లో 2,000 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి 2022 ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జాబ్‌ కేలండర్‌లోనూ ఈ పోస్టులను పేర్కొంది. కానీ, ఇంతవరకు ప్రకటన విడుదల కాలేదు.

No Faculty in Andhrapradesh universities
వర్సిటీల్లో ఆచార్యులేరీ?
author img

By

Published : Jun 8, 2022, 4:37 AM IST

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 3,259 అధ్యాపక పోస్టులు ఉండగా.. వాటిలో 60 శాతానికి పైగా ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ చేస్తున్నా కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ఒప్పంద అధ్యాపకులతోనే నెట్టుకు వస్తున్నారు.
విశ్వవిద్యాలయాల్లో 2,000 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి 2022 ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జాబ్‌ కేలండర్‌లోనూ ఈ పోస్టులను పేర్కొంది. కానీ, ఇంతవరకు ప్రకటన విడుదల కాలేదు.

విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పే గురువులే కరవయ్యారు. 60 శాతానికిపైగా రెగ్యులర్‌ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాశ్వత నియామకాలు లేకపోవడంతో ఒప్పంద, అతిథి, సహాయ ఆచార్యులతోనే నెట్టుకొస్తున్నాయి. ఒక పక్క అధ్యాపకుల కొరత ఉండగా.. కొందరు డిప్యుటేషన్‌పై ఇతర విభాగాల్లో పని చేస్తున్నారు. ఆంధ్ర, ఆచార్య నాగార్జున, శ్రీ వేంకటేశ్వర వంటి ప్రధాన వర్సిటీల్లోనూ కొన్ని విభాగాల్లో ఒక్కో ప్రొఫెసరే ఉండగా.. కొన్నింటికి ఒక్కరూ లేరు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగంలో ఒక్కరూ లేకపోవడంతో ఎయిడెడ్‌ నుంచి వచ్చిన అధ్యాపకుడికి బాధ్యతలు అప్పగించారు. పదవీ విరమణతో ఖాళీ అవుతున్న వాటిని భర్తీ చేయడం లేదు. పాఠాలు బోధించేవారు లేకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకులను వర్సిటీలు ఎలా సాధిస్తాయనే దానిపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదు. నియామకాలు చేయకుండానే అంతర్జాతీయ ప్రమాణాలు సాధించాలని తరచూ ఉన్నతాధికారులు, సీఎం జగన్‌ సమీక్షల్లో ప్రకటనలు చేస్తున్నారు.

యూజీసీ నిబంధనలు ఎక్కడ?
విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిబంధనల ప్రకారం ఒక్కో విభాగానికి కనీసం ఒక ఆచార్యుడు, ఇద్దరు అసోసియేట్‌ ఆచార్యులు, నలుగురు సహాయ ఆచార్యులు ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోనూ ఈ స్థాయిలో అధ్యాపకులు లేరు. ఒప్పంద, అతిథి అధ్యాపకులే ఉన్నారు. 20 మంది విద్యార్థులకు అధ్యాపకుడు ఉండాలి. పాఠాలు బోధించేందుకు రెగ్యులర్‌ అధ్యాపకులు ఉండాలనే నిబంధన అమలు కావడం లేదు. న్యాక్‌ గుర్తింపు లభించాలంటే మొత్తం పోస్టుల్లో 75 శాతం భర్తీ అయి ఉండాలి. దీని ఆధారంగా కేంద్ర సంస్థలు నిధులిస్తాయి. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విక్రమసింహపురి, జేఎన్‌టీయూ అనంతపురం, రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక వర్సిటీలాంటి వాటికి న్యాక్‌ గుర్తింపు లేదు.

కొత్త కోర్సుల మాటేమిటి?
విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసిన సమయంలో విభాగాలవారీగా పోస్టులను మంజూరు చేశారు. ప్రస్తుతం ఎన్నో కొత్త కోర్సులు వచ్చాయి. వీటికి అదనంగా పోస్టులను ఇవ్వాల్సి ఉంటుంది. జాతీయ విద్యావిధానం ప్రకారం వర్సిటీలు అన్ని రకాల కోర్సులను (సమ్మిళిత విద్య) నిర్వహించాలి. దీన్ని అమలు చేస్తే మరిన్ని పోస్టులు అవసరమవుతాయి. గతంలో మంజూరైన ఖాళీలే భర్తీ కాకపోవడంతో కొత్త వాటి ఊసే ఉండడం లేదు. ఇటీవల ఉన్నత విద్యామండలి పోస్టుల హేతుబద్ధీకరణకు కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇంతవరకు పోస్టుల సంఖ్యను తెల్చలేదు. సుమారు 3,000 వరకు ఖాళీలు వస్తాయని అంచనా వేస్తున్నారు. జాబ్‌ క్యాలెండర్‌లో 2,000 పోస్టులు ప్రకటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అత్యధికంగా 462, అతి తక్కువగా ద్రవిడ వర్సిటికీ 13 పోస్టులు ఇచ్చారు. ఇవి కాకుండా కొత్త కోర్సులకు మరో వెయ్యి వరకు పోస్టులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

గత ప్రక్రియపై న్యాయ వివాదాలు..
గత ప్రభుత్వ హయాంలో పోస్టుల హేతుబద్ధీకరణ జరిగింది. 91 ఆచార్య, 1,109 సహాయ, 56 అసోసియేట్‌ ఆచార్యుల పోస్టుల భర్తీకి 2017, 2018లో ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. సహాయ ఆచార్యుల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించారు. ఈ స్క్రీనింగ్‌ పరీక్ష, రిజర్వేషన్లు, పోస్టుల హేతుబద్ధీకరణపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నోటిఫికేషన్లను న్యాయస్థానం రద్దు చేసింది. సింగిల్‌ జడ్జి తీర్పుపై మరికొందరు ధర్మాసనం ముందు అప్పీల్‌కు వెళ్లారు.

ఒక్కో అధ్యాపకుడే దిక్కు..
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సుమారు 1,200 పోస్టులు ఉండగా.. ఇందులో రెగ్యులర్‌ అధ్యాపకులు 280 మంది మాత్రమే పని చేస్తున్నారు. పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాలకు కలిపి ఒకే ఒక్క అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఉన్నారు. సైకాలజీలో ఒకరు, భౌతికశాస్త్ర విభాగంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు.

  • శ్రీ వేంకటేశ్వరలో లైబ్రరీ సైన్సు, చరిత్ర, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, కంప్యూటర్‌ సైన్సు, బయోటెక్నాలజీ విభాగాల్లో ఒక్కో అధ్యాపకుడే ఉన్నారు. చరిత్ర విభాగంలో 11 పోస్టులకు ఒక్కరే మిగిలారు. సోషల్‌వర్క్‌, ఎడ్యుకేషన్‌, తమిళభాష విభాగాల్లో ఒక్కరూ లేరు. ఈ వర్సిటీలో 630 మంది వరకు బోధన సిబ్బంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం సగానికి లోపే ఉన్నారు.
  • ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్‌లో ఒక్క ప్రొఫెసరూ లేరు. జియాలజీ, గ్రామీణాభివృద్ధి విభాగంలో ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు. చరిత్ర, ఫుడ్‌, న్యూట్రిషన్‌ విభాగాల్లో అధ్యాపకులు ఇద్దరేసి ఉన్నారు.
  • శ్రీకృష్ణ దేవరాయలో జాగ్రఫీ, మైక్రోబయాలజీ, కామర్స్‌లలో ఒక్కొక్కరే ఉండగా.. ఆంగ్లం, చరిత్ర, జువాలజీలాంటి వాటికి ఒక్కరూ లేరు.
  • ఆదికవి నన్నయ, కృష్ణా వర్సిటీల్లో ఇన్‌ అర్గానిక్‌, బయో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, గణితం, వృక్షశాస్త్రం, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, కామర్స్‌ విభాగాల్లో ఒక్కరూ లేరు. కృష్ణాలో ఆంగ్ల విభాగానికి ఇద్దరు ఉండగా.. అప్లైడ్‌ మ్యాథ్స్‌కు ఒక్కరు ఉన్నారు. ఆదికవి నన్నయలో ఎడ్యుకేషన్‌ ఒక్కరు ఉండగా.. మిగతా ప్రధాన విభాగాలకు ఒక్కరూ లేరు.

ఇదీ చదవండి: నాడు-నేడు అంటే లక్షలాది విద్యార్థులు ఫెయిల్ కావడమేనా ?: చంద్రబాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.