లేఖ వివాదంపై రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసింది తనేనన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో లేఖ రాశానని తెలిపారు. ఎన్నికల కమిషనర్గా ఉన్న అధికార పరిధిలోనే లేఖ రాశానని నిమ్మగడ్డ రమేష్ చెప్పారు. ఈ లేఖపై ఎవరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా ఈ లేఖను నిర్ధారించారని పేర్కొన్నారు. లేఖపై ఎలాంటి ఆందోళన, సందేహాలు అవసరం లేదన్న ఆయన... ఈ విషయంపై ఎలాంటి వివాదాలు, రాద్ధాంతాలకు తావులేదన్నారు.
ఇదీ చదవండి : అలా చేస్తే ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనే: ఎస్ఈసీ