రాష్డ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బుధవారం నోటీసులు జారీ చేసింది. తాము 30 ఏళ్లుగా అనుభవిస్తున్న స్థలాలను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నించారంటూ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెం దళితులు ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు.
రాజకీయ కారణాలతో కక్షపూరితంగా వ్యవహరించి అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు సంబంధించిన పశువుల దొడ్లు, గడ్డివాములను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన కమిషన్ సీఎస్‌కు నోటీసు జారీ చేయడంతో పాటు ఆగస్టు 1లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: