ETV Bharat / city

వచ్చే ఐదేళ్లలో...5 గ్రీన్​ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​వేలు - సరకు రవాణాకు ఎన్​హెచ్ఏఐ రోడ్లు నిర్మాణం

రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లల్లో 5 గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్​వేలు నిర్మితమవనున్నాయి. సరకు రవాణా వాహనాలకు అనువుగా ఉండటంతో పాటు రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం తగ్గించడమే లక్ష్యంగా ఎన్​హెచ్​ఏఐ 2024-25 నాటికి వీటిని పూర్తి చేయనుంది. మన రాష్ట్రంలో వీటిని తక్కువ దూరమే నిర్మిస్తున్నా పొరుగు రాష్ట్రాల అనుసంధానానికి ఇవి కీలకం కానున్నాయి.

సరకు రవాణాకు 5 రాచబాటలు
సరకు రవాణాకు 5 రాచబాటలు
author img

By

Published : Aug 26, 2020, 6:01 AM IST

రానున్న ఐదేళ్లల్లో రాష్ట్రంలో ఐదు రాచబాటలు అందుబాటులోకి రానున్నాయి. పొరుగు రాష్ట్రాలతో అనుసంధానత పెంచడమే లక్ష్యంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ-ఎన్​హెచ్​ఏఐ 2024-25 నాటికి ఐదు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలను నిర్మించనుంది. దీని వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు వేగంగా చేరుకునే వెసులుబాటు ఏర్పడుతుంది. విశాఖ-రాయపుర్...దేవరాపల్లి-ఖమ్మం-సూర్యాపేట... విజయవాడ-నాగ్‌పుర్‌ ... రేణిగుంట-కడప... చిత్తూరు నుంచి తమిళనాడులోని తచ్చూరు మధ్య ప్రస్తుతమున్న రహదారులతో సంబంధం లేకుండా కొత్తగా వీటిని నిర్మించనున్నారు. సాధ్యమైనంత తక్కువ మలుపులు ఉండేలా.. ప్రారంభమైన చోటు నుంచి గమ్యస్థానానికి వీలైనంత తక్కువ దూరంలో నేరుగా వెళ్లేలా చూడనున్నారు. ప్రతి, గ్రామం పట్టణ పరిధిలో కొన్నిచోట్ల మాత్రమే ఈ రహదారిలో కలిసేందుకు, బయటకు వచ్చేందుకు వీలు కల్పిస్తారు. ఈ రహదారులపై సగటున 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా రూపొందించనున్నారు.

ఐదు గంటల్లో హైదరాబాద్

విశాఖ నుంచి రాయ్‌పుర్‌ మధ్య నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే విశాఖ జిల్లా సబ్బవరం వద్ద మొదలై కొత్తవలస, విజయనగరం, సాలూరు మీదుగా ఒడిశా సరిహద్దుల వరకూ రాష్ట్రంలో 100కిలోమీటర్ల మేర ఉంటుంది. కేవలం ఈ భాగ నిర్మాణానికి 2 వేల 300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద విశాఖ-రాయ్‌పుర్‌ మధ్య ప్రస్తుతం 2 వరుసల్లో 557 కిలోమీటర్ల మేర ఉన్న దూరాన్ని 6 వరుసల్లో 464 కిలోమీటర్లకు కుదించనున్నారు. దేవరాపల్లి-ఖమ్మం-సూర్యాపేట గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పరధి మన రాష్ట్రంలో 72 కిలోమీటర్లు ఉండనుంది. విశాఖ జిల్లా దేవరాపల్లి నుంచి తెలంగాణ సరిహద్దుల్లోని లింగగూడెం వరకూ దీని నిర్మాణం వల్ల ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి నుంచి వెళ్లేవారు హైదరాబాద్‌కు వేగంగా చేరుకోవచ్చు. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు 5 గంటల్లోనే చేరుకోవచ్చు.

తగ్గనున్న దూరం

ఉత్తరాది రాష్ట్రాలతో అనుసంధానం పెరగడమే కాక దూరాభారం తగ్గేలా విజయవాడ-నాగ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించనున్నారు. ప్రస్తుతం ఎన్​హెచ్​-65,44 ద్వారా ప్రయాణించి, విజయవాడ నుంచి నాగ్‌పుర్‌కు 772 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీని స్థానంలో 457 కిలోమీటర్ల దూరంతోనే 4 వరుసలను నిర్మించనున్నారు. చెన్నై నుంచి సూరత్‌కు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వేలో భాగంగా 120 కిలోమీటర్ల మేర చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి కడప దాకా రహదారి వేయనున్నారు. చెన్నై నుంచి సూరత్‌ మార్గాన్ని రాష్ట్రం మీదుగా వెళ్లేలా చేసి 100 కిలోమీటర్లకుపైగానే దూరాన్ని తగ్గించనున్నారు. చిత్తూరు నుంచి తమిళనాడులోని తచ్చూరు మధ్య 126 కిలోమీటర్ల మేర ఆరు వరుసల్లో మరో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మించనున్నారు. ఇందులో చిత్తూరు జిల్లా పరిధిలో 83 కిలోమీటర్లు ఉండనుంది . ఈ మార్గం వల్ల చెన్నైకి వెళ్లడం సులువు కానుంది.

ఇదీ చదవండి : జగన్​ పాలనలో కుంభకోణాలు హద్దు మీరాయి: కళా వెంకట్రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.